బిజినెస్

స్టాక్ మార్కెట్‌కు ‘పి-నోట్’ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 13: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలకు లోనయ్యాయి. మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతానికి పడిపోవడం, ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.39 శాతానికి పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మరోవైపు పి-నోట్ నిబంధనలను మార్కెట్ రెగ్యులేటర్ సెబీ కఠినతరం చేయడం విదేశీ మదుపరుల పెట్టుబడులకు విఘాతం కలిగించింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 300.65 పాయింట్లు పతనమై 25,489.57 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 85.50 పాయింట్లు క్షీణించి 7,814.90 వద్ద స్థిరపడింది. రియల్టీ, మెటల్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల షేర్ల విలువ 2.07 శాతం నుంచి 1.25 శాతం మధ్య దిగజారింది. మిడ్-క్యాప్ సూచీ 0.58 శాతం, స్మాల్-క్యాప్ సూచీ 0.25 శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలోనూ చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు 0.31 శాతం నుంచి 1.41 శాతం క్షీణించాయి. ఐరోపా మార్కెట్లలో కూడా ప్రధాన సూచీలైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 0.58 శాతం నుంచి 0.67 శాతం వరకు పతనమయ్యాయి.
ఎన్‌ఎస్‌ఇలో బాండ్ల వేలం
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) ఈ నెల 16న విదేశీ మదుపరులకు ప్రభుత్వ బాండ్లను విక్రయించనుంది. సాధారణ ట్రేడింగ్ అనంతరం మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు రెండు గంటల పాటు 3,340 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ రుణ సెక్యూరిటీలను ఎన్‌ఎస్‌ఇ వేలం వేయనుంది. కాగా, ప్రభుత్వ రుణ సెక్యూరిటీల్లో విదేశీ మదుపరులకున్న పెట్టుబడుల పరిమితి 1,40,000 కోట్ల రూపాయలు. అయితే ప్రస్తుతం ఇది 1,36,660 కోట్ల రూపాయలుగా ఉంది. మిగతా మొత్తానికి సోమవారం వేలం జరగనుంది.

యూకో బ్యాంక్
నష్టం రూ. 1,715 కోట్లు
న్యూఢిల్లీ, మే 13: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ యూకో బ్యాంక్ నికర నష్టం గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఆఖరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 1,715.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు (2014-15) జనవరి-మార్చిలో 209.2 కోట్ల రూపాయల లాభాన్ని బ్యాంక్ అందుకోవడం గమనార్హం. నష్టాలకు కారణం ఆదాయం క్షీణించిపోవడమేనని ఓ ప్రకటనలో బ్యాంక్ శుక్రవారం తెలియపరిచింది. ఈసారి ఆదాయం 4,745.4 కోట్ల రూపాయలకు పరిమితమవగా, పోయినసారి 5,263.3 కోట్ల రూపాయలుగా ఉంది. కాగా, 2015-16 మొత్తంగా బ్యాంక్ నష్టం 2,799.2 కోట్ల రూపాయలుగా ఉంది.

బ్యాంక్ ఆఫ్ బరోడా
నష్టం రూ. 3,230 కోట్లు
ముంబయి, మే 13: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 3,230.14 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూసింది. భారతీయ బ్యాంకింగ్ చరిత్రలోనే ఓ త్రైమాసికంలో ఈ స్థాయిలో నష్టం వాటిల్లడం ఇది రెండోసారి. 2015-16లోనే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఇదే బ్యాంక్ 3,342.04 కోట్ల రూపాయల నష్టాన్ని పొందింది. ఇది అత్యధికంగా ఉంది. ఇక ఆదాయం ఈ జనవరి-మార్చిలో 12,789 కోట్ల రూపాయలుగా ఉంటే, నిరుడు జనవరి-మార్చిలో 12,057 కోట్ల రూపాయలుగా ఉందని శుక్రవారం బ్యాంక్ స్పష్టం చేసింది.

ఆర్‌బిఐ వడ్డీరేట్లపై అంచనాలు

ఆగస్టులో తగ్గొచ్చు: బ్యాంక్ ఆఫ్ అమెరికా
ముంబయి, మే 13: ఆగస్టు నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను తగ్గించేందుకు వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ శుక్రవారం అంచనా వేసింది. ఏప్రిల్ నెలకుగాను గురువారం విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు 5.39 శాతానికి ఎగిసిన నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా, ముడి చమురు ధర బ్యారెల్‌కు 39 డాలర్ల వరకు తగ్గితే ద్రవ్యోల్బణం దిగివచ్చే అవకాశాలున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఆగస్టు 9న జరిపే ద్య్రసమీక్షలో రెపో రేటును ఆర్‌బిఐ తగ్గిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే అంతకుముందే జూన్ 7న జరిగే ద్రవ్యసమీక్షలో మాత్రం వడ్డీరేట్లు తగ్గేందుకు ఆస్కారం లేదంది.

ఈ ఏడాదంతా యథాతథం: నొమురా
న్యూఢిల్లీ, మే 13: ఈ ఏడాదిలో ఇక కీలక వడ్డీరేట్ల తగ్గింపు జోలికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వెళ్ళకపోవచ్చని నొమురా అంచనా వేసింది. 7వ వేతన సంఘం సిఫార్సుల నేపథ్యంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలున్నందున ఈ ఏడాది ఆఖరు వరకు జరిగే ద్రవ్యసమీక్షల్లో ఆర్‌బిఐ.. రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లను యథాతథంగానే కొనసాగించవచ్చని నొమురా ఓ నివేదికలో శుక్రవారం అభిప్రాయపడింది. ‘ద్రవ్యోల్బణం ఏమాత్రం తగ్గిన సంకేతాలు కనిపించడం లేదు. ఉద్యోగుల జీతాలను పెంచాలన్న 7వ వేతన సంఘం సిఫార్సు మధ్య ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. కాబట్టి 2016 చివరి వరకు కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ ఎలాంటి మార్పు లేకుండా ఉన్నచోటనే ఉంచుతుందని అనుకుంటున్నాం.’ అని నొమురా నివేదికలో పేర్కొంది.