బిజినెస్

మార్చికల్లా పేమెంట్స్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 20: ఆదిత్యా బిర్లా నువో లిమిటెడ్ (ఎబిఎన్‌ఎల్) వచ్చే ఏడాది మార్చికల్లా పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభించాలని యోచిస్తోంది. పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించిన నేపథ్యంలో తమ గ్రూప్‌లోని అనుబంధ సంస్థ ఐడియాతో కలిసి 51:49 భాగస్వామ్యంలో ఓ జాయింట్ వెంచర్‌ను ఎబిఎన్‌ఎల్ ఈ ఫిబ్రవరిలో నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ముగింపులోగా పేమెంట్స్ బ్యాంక్ సేవలను అందుబాటులోకి తెస్తామని శుక్రవారం జనవరి-మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఎబిఎన్‌ఎల్ చెప్పింది. కాగా, తమ ఆర్థిక సేవల సంస్థ ఆదిత్యా బిర్లా ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఎబిఎఫ్‌ఎస్) గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 995 కోట్ల రూపాయల లాభాన్ని అందుకున్నట్లు ఎబిఎన్‌ఎల్ తెలిపింది.