బిజినెస్

వృద్ధిరేటు 7.7 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: దేశ జిడిపి వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) లో 7.7 శాతంగా ఉండొచ్చని భారత పారిశ్రామిక సంఘం ఫిక్కీ అంచనా వేసింది. ఈసారి వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న అంచనాల మధ్య పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో పురోగతి ఉంటుందని పేర్కొంది. అయితే మందగించిన పెట్టుబడుల ప్రవాహం తిరిగి పుంజుకోవడానికి కనీసం మరో ఆరు నెలల సమయమైనా పడుతుందని ఓ సర్వేలో ఫిక్కీ అభిప్రాయపడింది. ‘ఈ ఆర్థిక సంవత్సరం పారిశ్రామిక, వ్యవసాయ రంగాల మద్దతుతోనే దేశ జిడిపి వృద్ధిపథంలో నడుస్తుంది. గడచిన రెండేళ్లు వర్షాభావ పరిస్థితుల మధ్య ఈసారి ఆశాజనక వర్ష అంచనాలు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడుతున్నాయి.’ అని తాజాగా విడుదల చేసిన ఎకనామిక్ ఔట్‌లుక్ సర్వేలో ఫిక్కీ తెలిపింది. కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం దేశ జిడిపి వృద్ధిరేటు 7.6 శాతంగా ఉండొచ్చని గత నెల ఏప్రిల్‌లో అంచనా వేసినది తెలిసిందే.