బిజినెస్

ఆన్‌లైన్‌లోనూ ‘రాజన్’ రచ్చ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 5: ఇప్పుడు ఏ పత్రికలో చూసినా, మరే వార్తా చానల్‌లో విన్నా పతాక శీర్షికల్లో కనిపిస్తోంది ఓ అంశం. అది.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్‌గా మరోసారి రఘురామ్ రాజన్ ఉంటారా? లేదా? అన్నదే. అవును మరి.. 1992 నుంచి గమినిస్తే ఆర్‌బిఐ గవర్నర్‌గా పనిచేసిన వారంతా కూడా ఐదేళ్లకుపైగా ఉన్నవారే. దీంతో ఈ సెప్టెంబర్‌తో ముగుస్తున్న రాజన్ మూడేళ్ల పదవీకాలం పొడిగింపు అవుతుందా? కాదా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అదీగాక ముక్కుసూటి మనస్తత్వం కలిగిన రాజన్‌తో కేంద్రంలోని అధికార బిజెపి సర్కారుకు తలనొప్పులు కూడా ఎక్కువే. దేశ ఆర్థిక వ్యవస్థ గొప్పగా ఉందని ఊదరగొడుతూ విదేశాల్లో పెట్టుబడుల కోసం ఓ వైపు మోదీ అండ్ కో ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు విదేశీ పర్యటనల్లో భాగంగా వివిధ కార్యక్రమాల్లో, చానళ్లతో మాట్లాడుతున్న రాజన్ మాత్రం భారత ఆర్థిక వ్యవస్థ తీరు గుడ్డివాళ్ల రాజ్యంలో ఒంటికన్ను రాజు మాదిరి ఉందని అంటుండటం కేంద్రానికి మింగుడు పడటం లేదు. నిజానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందిన ఓ ఆర్థికవేత్తగా రాజన్ నిజమే చెబుతున్నా.. రాజకీయంగా అది తీవ్ర దుమారానికి కారణమవుతోంది. ఈ క్రమంలోనే బిజెపి ఎంపి సుబ్రమణ్యన్ స్వామి వంటివారు రాజన్‌ను కొనసాగించవద్దని పెద్ద ఎత్తున నిరసన తెలుపుతుండటం, పలువురు కేంద్ర మంత్రులు దానికి మద్దతు పలుకుతుండటంతో రాజన్ సెకండ్ ఇన్నింగ్స్ వార్తాల్లోకెక్కిందిప్పుడు. ఇక అసలు విషయానికొస్తే ఇంటర్నెట్‌లోనూ తెగ హల్‌చల్ చేస్తోంది రాజన్ గవర్నర్ గిరి. రాజన్‌కు మరోసారి ఆర్‌బిఐ గవర్నర్‌గా అవకాశం ఇవ్వాలని మెజారిటీ నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటిదాకా దాదాపు 60,000 మంది తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఆన్‌లైన్ పిటిషన్ వేదికైన చేంజ్ డాట్ ఒఆర్‌జిపై ఆర్‌బిఐ గవర్నర్‌గా మరోసారి రాజన్‌ను కొనసాగించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ సుమారు 60,000 మంది సంతకాలు చేశారు. ఇందులో బెంగళూరుకు చెందిన రాజేశ్ పలరియా ద్వారా దాఖలైన పిటిషన్‌కు మద్దతుగానే 57,000 సంతకాలు వచ్చాయి. అయితే మొత్తం ఈ వ్యవహారంలో ఏడు ఆన్‌లైన్ పిటిషన్లు దాఖలవగా, అందులో ఐదు అనుకూలంగా ఉంటే, రెండు వ్యతిరేకంగా ఉన్నాయి. వ్యతిరేకంగా ఉన్నవాటికి ఆదరణ తక్కువగానే ఉండటం విశేషం. ఇదిలావుంటే రాజన్‌కు రెండోసారి అవకాశం ఇవ్వాలని కార్పొరేట్, ఆర్థిక రంగాల నుంచి మద్దతు పెరుగుతోంది. తాజాగా ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ఇండో-అమెరికన్ ఆర్థికవేత్త అయిన అవినాష్ దీక్షిత్ కూడా ఈ జాబితాలో చేరారు. యుపిఎ హయాంలో ఆర్‌బిఐ గవర్నర్‌గా వచ్చిన రాజన్ కూడా తనకు మరోసారి బాధ్యతలు చేపట్టాలని ఉందని చెప్పినది తెలిసిందే.