బిజినెస్

భారత్ అవకాశాల గని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెట్టుబడులకు సరైన ప్ర‘దేశం’ ౄ ఖతార్ వ్యాపారవేత్తలకు మోదీ పిలుపు
వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తున్నాం ౄ చాలా రంగాల్లో ఎఫ్‌డిఐని అనుమతించామని స్పష్టీకరణ
రైల్వేలు, రక్షణ, తయారీ, ఆహార రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలని వెల్లడి
మా విధానాలతో మీకున్న ఇబ్బందులు ఏమిటో చెబితే పరిష్కరిస్తామంటూ మదుపరులకు హామీ

దోహా, జూన్ 5: పెట్టుబడులకు భారత్‌లో ఉన్న అనువైన పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఖతార్ వ్యాపారవేత్తలకు వివరించారు. పెట్టుబడులకు భారత్ సరైనదని, భారత వ్యాపార రంగంలో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారికి పిలుపునిచ్చారు. ముఖ్యంగా వౌలిక రంగంలో పెట్టుబడులకు విశేష అవకాశాలున్నాయని తెలిపారు. వ్యాపార రిత్యా భారత్‌లో ఏవైనా ఇబ్బందులుంటే వాటిని తెలియజేయాలని, తప్పక పరిష్కరిస్తామన్న హామీని కూడా మోదీ ఈ సందర్భంగా ఖతార్ వ్యాపార, పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. శనివారం రాత్రి ఇక్కడకు చేరుకున్న మోదీ.. ఆదివారం ఖతార్ వ్యాపార దిగ్గజాలతో గంటపాటు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిం చారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి గడచిన రెండేళ్లలో తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వారి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా మోదీ అడిగి తెలుసుకున్నారు. కాగా, వివిధ రంగాల్లో ఉన్న నిబంధనలు, అనుమతులపై వేసిన ప్రశ్నలకు మోదీ బదులిస్తూ అంతర్జాతీయ వ్యాపార సమాజానికి అభ్యంతరకరంగా ఉన్న వాటిని పరిశీలించి, అందరికీ ఆమోదయోగ్యమైన మార్పులు చేస్తామని, ఇప్పటికే వివిధ రంగాల్లో నిబంధనలను, అనుమతులను, విధానాలను మార్చామని గుర్తుచేశారు. చాలా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)కు మార్గం సుగమం చేశామని చెప్పారు. రైల్వేలు, రక్షణ, తయారీ, ఆహార తయారీ రంగాల్లో ఎఫ్‌డిఐకి పెద్దపీట వేసినట్లు వివరించారు. అంతేగాక పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు భారీగా అవకాశాలున్నాయని తెలిపారు. భారత్‌లో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ‘్భరత్ అవకాశాలకు పుట్టినిల్లు. ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని ఖతార్ వ్యాపారులకు మోదీ పిలుపునిచ్చినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. ‘్భరత్ సామర్థ్యాన్ని గుర్తించండి. పెట్టుబడులతో రండి. మీకున్న ఇబ్బందులేమిటో చెబితే వాటిని నేను పరిష్కరిస్తాను.’ అని ఖతార్ వ్యాపారవేత్తలతో మోదీ అన్నారు. ఖతార్ సావరిన్ వెల్త్ ఫండ్, ఇతర ప్రభుత్వ సంస్థలు భారత వౌలిక రంగంలో పెట్టుబడులకు ఆసక్తిని చూపిస్తున్నాయని మోదీ చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ తదితర ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల గురించి కూడా ఈ సందర్భంగా మోదీ వ్యాపారులకు వివరించారు. ఖతార్ పెట్టుబడులకు రైల్వేలు, సౌరశక్తి అనువైనవని సూచించారు. భారత్‌లోని 80 కోట్ల యువత, వౌలికరంగ విస్తరణ, ఆధునీకరణ, తయారీ రంగాలు తమ బలమని కూడా మోదీ ఈ సందర్భంగా అన్నారు. ఇకపోతే ఖతార్‌కు గడచిన రెండేళ్లలో భారత ఎగుమతులు కూడా పెరిగాయని మెషినరీ, టెక్స్‌టైల్స్, ఎలక్ట్రానిక్స్, కన్‌స్ట్రక్షన్ మెటీరియల్, రసాయనాలు, సుగంధద్రవ్యాలు, తృణధాన్యాల ఎగుమతులు భారత్ నుంచి ఖతార్‌కు గణనీయంగా పెరిగాయని వివరించారు. కాగా, మోదీతో సమావేశమైన ఖతార్ వ్యాపారవేత్తల్లో క్యుబిఎ చైర్మన్, అల్ ఫైజల్ హోల్డింగ్ సిఇఒ షేక్ ఫైజల్ బిన్ ఖాసిమ్ అల్-తహని, దోహా బ్యాంక్ చైర్మన్ షేక్ ఫహద్ ఎమ్‌జె అల్-తహని, ఖతార్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సిఇఒ రషీద్ అలీ అల్-మసూరి ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ స్విట్జర్లాండ్, అమెరికా, మెక్సికోల్లోనూ పర్యటించనున్నారు. ఇప్పటికే అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించినది తెలిసిందే. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. భారత ఎగుమతుల విలువ దాదాపు 1 బిలియన్ డాలర్లు. జపాన్, దక్షిణ కొరియా తర్వాత ఖతార్‌కు అత్యధికంగా ఎగుమతులు జరిగేది భారత్ నుంచే. ఇక భారత్-ఖతార్ ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎల్‌ఎన్‌జిదే అగ్రస్థానం. ఖతార్ నుంచి ఎథిలిన్, ప్రొపిలిన్, అమ్మోనియా, యూరియా, పాలిథిలిన్‌ను భారత్ ఎక్కువగా కొనుగోలు చేస్తోంది. భారత చమురు అవసరాల్లో కూడా 65 శాతం ఖతార్ ద్వారానే తీరుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఖతార్‌తో భారత్ అనుబంధానికిది నిదర్శనం.