బిజినెస్

బిగ్‌బజార్ క్యాష్, బోనస్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ వ్యాపార విభాగం.. బిగ్‌బజార్ తమ వినియోగదారులకు ఓ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. ఇక ప్రతి నెలా మొదటి 8 రోజులు (1 నుంచి 8వ తేదీ మధ్య) తమ స్టోర్లలో జరిపే 2,500 రూపాయలకుపైగా కొనుగోళ్లపై 2,000 రూపాయల విలువైన ‘మంత్లీ క్యాష్/ బోనస్ వోచర్ల’ను వినియోగదారులకు ఇవ్వనుంది. దీంతో నెలలో మిగతా రోజులు (9 నుంచి నెల చివరిదాకా) చేసే కొనుగోళ్లపై వినియోగదారులకు ప్రత్యేక ప్రయోజనం ఉంటుందని, రాయితీలుంటాయని పేర్కొంది. ఈ మేరకు బిగ్‌బజార్ సిఇఒ సదాశివ్ నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. తమకు కావాల్సిన వస్తువులను మార్కెట్‌లో అతి తక్కువ ధరకే బిగ్‌బజార్‌లో పొందుతున్న వినియోగదారులు.. ఇకపై మరింత పొదుపు చేసుకోవచ్చని, బోలెడన్నీ డిస్కౌంట్ ఆఫర్లు అందుకోవచ్చని కూడా నాయక్ చెప్పారు.