బిజినెస్

మార్కెట్‌లో సంస్కరణల ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 15: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలను అందుకున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మదుపరులను ఉత్సాహపరిచాయి. కేంద్ర కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలతో మదుపరులు పెట్టుబడులతో ముందుకొచ్చారు. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 330.63 పాయింట్లు పెరిగి 26,726.34 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 97.75 పాయింట్లు ఎగిసి 8,200 స్థాయికి ఎగువన 8,206.60 వద్ద నిలిచింది. నిజానికి అమెరికా ఫెడ్ రిజర్వ్ ద్రవ్యసమీక్ష, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై రెఫరెండమ్ మధ్య మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది తెలిసిందే. ఇటీవలి మార్కెట్ ట్రేడింగ్ ఇందుకు నిదర్శనం. అయితే కొత్తగా పౌరవిమానయాన విధానం ప్రవేశపెట్టడం, ఎస్‌బిఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనాన్ని ఆమోదించడం, ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాల విక్రయానికి అంగీకరించడం, నూతన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపడం వంటివి బుధవారం మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచాయి. ఈ క్రమంలో బ్యాంకింగ్ షేర్లతోపాటు విమానయానరంగ షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ఎస్‌బిఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, ట్రావన్‌కోర్, బికనీర్ అండ్ జైపూర్ షేర్ల విలువ 3.90 శాతం నుంచి 20 శాతం వరకు పెరిగింది. అలాగే జెట్ ఎయిర్‌వేస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్పైస్‌జెట్ షేర్ల విలువ కూడా 0.21 శాతం నుంచి 3.51 శాతం వరకు ఎగిసింది. క్యాపిటల్ గూడ్స్, యుటిలిటిస్, పవర్, ఐటి, ఫైనాన్స్, చమురు, గ్యాస్ రంగాల షేర్లకూ మదుపరుల కొనుగోళ్ల మద్దతు లభించింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, తైవాన్, సింగపూర్ సూచీలు 0.21 శాతం నుంచి 1.58 శాతం మేర లాభపడ్డాయి. దక్షిణ కొరియా సూచీ మాత్రం 0.16 శాతం నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలోనూ ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు 1.10 శాతం నుంచి 1.72 శాతం వరకు పెరిగాయి.