బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్‌లోకి మ్యాక్స్ లైఫ్, ఫైనాన్షియల్ సర్వీస్‌లు విలీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ప్రైవేట్ బీమా రంగంలో అతిపెద్ద ఏకీకరణకు తెర లేసింది. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విలీనమవుతున్నాయి. ‘ఓ పథకం ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విలీనం జరుగుతోంది. ఇందుకు మూడు సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.’ అని నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది. భాగస్వాములు, రెగ్యులేటరీ, న్యాయస్థానాలు, ఇతరత్రా థర్డ్ పార్టీ అనుమతులు పొందాల్సి ఉందని హెచ్‌డిఎఫ్‌సి పేర్కొంది. కాగా, ప్రస్తుతం దేశీయ బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)ను అనుమతిస్తున్నారు.

తగ్గిన నిస్సాన్ మైక్రా సివిటి ధరలు

న్యూఢిల్లీ, జూన్ 17: జపాన్‌కు చెందిన ఆటోరంగ దిగ్గజ సంస్థ నిస్సాన్.. తమ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంటైన ప్రీమియం హచ్‌బ్యాక్ ‘మైక్రా’ ధరలను తగ్గించింది. ఎక్స్‌షోరూం ఢిల్లీ ప్రకారం గరిష్ఠంగా 54,252 రూపాయల తగ్గుదలను శుక్రవారం నిస్సాన్ ప్రకటించింది. దీంతో మైక్రా సివిటి ఆటోమెటిక్ ఎక్స్‌ఎల్ మోడల్ ధర 6,53,252 రూపాయల నుంచి 5,99,000 రూపాయలకు తగ్గింది. అలాగే మైక్రా ఆటోమెటిక్ సివిటి ఎక్స్‌వి మోడల్ ధర 45,713 రూపాయలు దిగి 7,19,213 రూపాయల నుంచి 6,73,500 రూపాయలకు వచ్చింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ మల్హోత్రా పిలుపునిచ్చారు.
కాగా, ఎఆర్‌ఎఐ పరీక్షల ప్రకారం మైక్రా సివిటి మోడల్ కార్లు లీటర్‌కు 19.34 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయని తేలిందని చెప్పారు.