బిజినెస్

రిట్, పోర్ట్ఫోలియో మేనేజర్లకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 17: మదుపరులు, నిర్మాణరంగ వర్గాలను ఆకట్టుకోవడానికి మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్టు (ఆర్‌ఇఐటి లేదా రిట్)ల నిబంధనలను సరళతరం చేసింది. శుక్రవారం ఇక్కడ జరిగిన బోర్డు సమావేశంలో ఆర్‌ఇఐటిలపై ఆంక్షలను తొలగించేందుకూ సెబీ ప్రతిపాదనలు చేసింది. నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లో మరిన్ని పెట్టుబడులకు ఆర్‌ఇఐటిని అనుమతించింది.
ప్రస్తుతం అనుమతించిన 10 శాతం గరిష్ఠ స్థాయి నుంచి 20 శాతానికి పెంచింది. స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పివి) నిర్మాణాల్లో పెట్టుబడులకు సంబంధించి ఉన్న అడ్డంకులను తొలగించాలని నిర్ణయించింది. అలాగే పార్టీ లావాదేవీలకు సంబంధించీ నిబంధనలను సరళతరం చేసింది. కాగా, 2014లో ఆర్‌ఇఐటి రెగ్యులేషన్లను సెబీ నోటిఫై చేసినది తెలిసిందే. మరోవైపు తాజా నిర్ణయం నేపథ్యంలో ఓ రియల్టీ సంస్థగా మారిన రిట్.. రాబోయే ఏడాది కాలంలో స్టాక్ మార్కెట్లలోకీ ప్రవేశించే వీలుందని నిపుణులు చెబుతున్నారు.
ఇకపోతే విదేశీ ఫండ్ మేనేజర్లకూ సెబీ ఊరటనిచ్చింది. సడలించిన రెగ్యులేటరీ విధానంలో భాగంగా ఫారిన్ ఫండ్ మేనేజర్లను పోర్ట్ఫోలియో మేనేజర్లుగా పరిగణించాలన్న ప్రతిపాదనను కూడా సెబీ ఆమోదించింది. ఇప్పటికే దేశంలో రీలోకేట్‌కు విదేశీ నిధి నిర్వాహకులకు పన్ను ప్రోత్సాహకాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సెబీ తాజా నిర్ణయం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
112 సంస్థలపై నిషేధం ఖరారు
న్యూఢిల్లీ: స్టాక్ ఎక్స్‌చేంజ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు పాల్పడిన కేసులో 112 సంస్థలపై నిషేధాన్ని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ ధ్రువీకరించింది. ఈ ఏడాది మార్చి 29న ఈ కేసుకు సంబంధించి మొత్తం 246 సంస్థలను స్టాక్ మార్కెట్ కార్యకలాపాల నుంచి సెబీ నిషేధించగా, ఇందులో పై 112 సంస్థలు కూడా ఉన్నాయి.
మధ్యంతర ఉత్తర్వుతో ఈ 246 సంస్థలను సెబీ నిషేధించింది. కాగా, మరిన్ని సంస్థలపైనా ఈ దిశగా సమగ్ర దర్యాప్తు కొనసాగుతున్నట్లు ప్రకటించింది.