బిజినెస్

వౌలిక రంగంలో తెలంగాణ ఆకర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ రాష్ట్రం వౌలిక సదుపాయాల రంగం ప్రభుత్వరంగ పెట్టుబడుల్లో దేశం మొత్తం మీద మూడవ స్థానంలో ఉందని, 36 శాతం వృద్ధిరేటు సాధించిందని, కాని విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్లు, మంచినీటి రంగంలో అనుసంధానం పెంచాల్సి ఉందని అసోచామ్ ప్రకటించింది. దేశంలో ప్రతిష్టాత్మక మైన ది అసోసియేటెడ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్, తెలంగాణ డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్ శ్రీకాంత్ బాడిగ శుక్రవారం ఇక్కడ భారతదేశంలో వౌలిక సదుపాయాల రంగంపై విశే్లషణ అనే సర్వే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వౌలిక సదుపాయాల రంగంలో పబ్లిక్ రంగ పెట్టుబడుల్లో 44 శాతం వృద్ధిరేటుతో చత్తీస్‌గడ్ ప్రథమ స్ధానంలో, 38 శాతంతో హిమాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచాయన్నారు. తెలంగాణలో వౌలిక సదుపాయాల రంగంలో ప్రైవేట్ పెట్టుబడుల్లో ఐదు శాతం ప్రతికూల వృద్ధిరేటు నమోదైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రం మినిమమ్ మాగ్జిమమ్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, సులభ రీతిన వాణిజ్య రంగం వృద్ధికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు. చిన్న, తరహా పరిశ్రమల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ఎక్కువ శ్రద్ధ కనపరచాలని, ఉపాధి అవకాశాలు ఈ రంగంలో ఎక్కువన్నారు. రాష్ట్రంలో వౌలిక సదుపాయాల ప్రాజెక్టులు 83 శాతం నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. రాజకీయ, నియంత్రణ అథారిటీల అవరోధాలను తొలగించాలని, అనుమతుల్లో జాప్యం ఉండరాదని, ఇనె్వస్టర్లకు చట్టపరమైన చికాకులు కల్పించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.