బిజినెస్

1.8 లక్షల కోట్లు ఆవిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 24: బ్రెగ్జిట్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు భారీ నష్టాలు వాటిల్లగా, మదుపరుల సంపద లక్షల కోట్ల రూపాయల్లో ఆవిరైపోయింది. బిఎస్‌ఇ సెనె్సక్స్ 604 పాయింట్లు పతనమైన క్రమంలో మదుపరుల సంపద దాదాపు 1.8 లక్షల కోట్ల రూపాయలు దిగజారింది. బిఎస్‌ఇ 100 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ నుంచి కూడా వైదొలిగింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి బిఎస్‌ఇలోని సంస్థల మార్కెట్ విలువ 1,01,38,441.15 కోట్ల రూపాయలుగా ఉంటే, శుక్రవారం మార్కెట్ ముగిసే నాటికి ఇది 99,60,513 కోట్ల రూపాయలకు పడిపోయింది. దీంతో ఈ ఒక్కరోజే 1,77,928.15 కోట్ల రూపాయలను మదుపరులు నష్టపోయారు. కాగా, ఒకానొక దశలో సెనె్సక్స్ 1,100 పాయింట్ల మేర నష్టపోగా, మదుపరుల సంపద సుమారు 4 లక్షల కోట్ల రూపాయల వరకు పతనమైంది.