బిజినెస్

బేర్ మనిపించిన ‘బ్రెగ్జిట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుదేలు ౄ ఈయు నుంచి బ్రిటన్ వైదొలగడాన్ని జీర్ణించుకోలేని మదుపరులు
సెనె్సక్స్ 604, నిఫ్టీ 182 పాయింట్లు క్షీణత ౄ ఆరంభంలో విపరీతమైనా.. చివర్లో తగ్గిన నష్ట తీవ్రత
ప్రధాన దేశాల కరెన్సీల్లో తీవ్ర ఒడిదుడుకులు ౄ 31 ఏళ్ల కనిష్టానికి పౌండ్ పతనం

ముంబయి, జూన్ 24: భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లను బ్రెగ్జిట్ బెంబేలెత్తించింది. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ బయటకురావడాన్ని (బ్రెగ్జిట్) స్టాక్, కరెన్సీ మార్కెట్లు జీర్ణించుకోలేకపోయాయి. గురువారం జరిగిన ఓటింగ్‌లో అత్యధిక మంది బ్రిటనీయులు బ్రెగ్జిట్‌కు మద్దతు పలికినట్లు శుక్రవారం వెల్లడైన ఫలితాలు స్పష్టం చేశాయి. దీంతో శుక్రవారం ఆసియా, ఐరోపా స్టాక్ మార్కెట్లతోపాటు ఆయా దేశాల కరెన్సీలు కూడా భారీ ఎత్తున క్షీణించాయి. భారత్ విషయానికొస్తే బ్రెగ్జిట్ ప్రభావం మదుపరులపై పెద్ద ఎత్తునే కనిపించింది. ఉదయం ఆరంభం నుంచి నష్టాల్లోనే కదలాడాయి. ఒకానొక దశలోనైతే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 1,090.89 పాయింట్లు దిగజారింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 343.40 పాయింట్లు కోల్పోయింది. అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తదితరులు ఇచ్చిన ధైర్యంతో మదుపరుల ఆందోళన ఒకింత తగ్గింది. దీంతో నష్టాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ సెనె్సక్స్ 604.51 పాయింట్లు క్షీణించి 26,397.71 వద్ద ముగియగా, నిఫ్టీ 181.85 పాయింట్లు దిగజారి 8,088.60 వద్ద నిలిచింది. మిడ్-క్యాప్ 1.07 శాతం, స్మాల్-క్యాప్ 1.46 శాతం చొప్పున నష్టపోయాయి. రియల్టీ, ఇండస్ట్రియల్, మెటల్, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్, ఆటో, ఎనర్జీ, ఫైనాన్స్, ఐటి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
టాటా గ్రూప్‌నకు దెబ్బ
బ్రెగ్జిట్ ప్రభావం బ్రిటన్‌లో పలు రకాల వ్యాపారాలను చేస్తున్న భారతీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్‌పై అధికంగా పడింది. శుక్రవారం ట్రేడింగ్‌లో టాటా సంస్థల షేర్లు 8 శాతం వరకు నష్టపోయాయి. టాటా మోటార్స్ 7.99 శాతం, టాటా స్టీల్ 6.37 శాతం, టిసిఎస్ 2.78 శాతం చొప్పున కోల్పోయాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్ అయితే సెనె్సక్స్ టాప్-30 నష్టాల సంస్థల్లో ఉన్నాయి. ఇక టాటా స్పంజ్ 4.61 శాతం, టాటా ఎగ్జి 3.62 శాతం, వోల్టాస్ 3.48 శాతం, టాటా గ్లోబల్ బేవరేజెస్ 1.86 శాతం, టాటా కెమికల్స్ 1.67 శాతం, టాటా కమ్యూనికేషన్స్ 1.40 శాతం చొప్పున క్షీణించాయి. టాటా గ్రూప్‌లో 100కు పైగా సంస్థలుండగా, స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన సంస్థల్లో 26 సంస్థలకు నష్టాలు తప్పలేదు. ఈ సంస్థల మార్కె ట్ విలువే ఈ ఒక్కరోజు 28,000 కోట్ల రూపాయలకుపైగా పడిపోయింది.

బ్రెగ్జిట్‌పై స్పందించారిలా..

‘ద్రవ్యలభ్యతను పెంపొందిస్తాం. నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లను తిరిగి లాభాల్లోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడతాం.
- ఆర్‌బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్
‘బ్రిటన్‌లోని భారత సంస్థలకు వ్యాపార నిర్వహణార్థం కేంద్రం కావాల్సినంత మద్దతునిస్తుంది.’
- కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి జయంత్ సిన్హా
‘బ్రెగ్జిట్ కారణంగా చమురు ధరలు పడిపోవడం, అమెరికాలో కీలక వడ్డీరేట్ల పెంపు ఆలస్యం కావడం వంటివి భారత్‌కు కలిసొస్తాయ.’
- ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్
‘ఈ పరిస్థితిని చక్కదిద్దే సామర్థ్యం భారత్‌కుంది. స్టాక్, కరెన్సీ మార్కెట్లు భారీగా పతనమైనా కోలుకుంటాం. ఇదంతా తాత్కాలికమే.’
- ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్
‘బ్రెగ్జిట్ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌తో భారత్ ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని మళ్లీ సరిదిద్దుకుంటుంది.’
- వాణిజ్య కార్యదర్శి రీటా టియోటియా
‘బ్రెగ్జిట్‌తో బ్రిటన్, ఈయులోని భారతీయ సంస్థలు తమ వ్యాపార వ్యూహాన్ని తగువిధంగా మార్చుకోవాల్సి ఉంటుంది.’
- సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్
‘్భరత ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం తాత్కాలికమే.’
- సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ
‘బ్రిటన్‌లో భారతీయ సంస్థల వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. భారీగా పెట్టుబడులు పెట్టాయి. అవన్నీ కూడా తమ వ్యాపార ప్రణాళికలను తిరిగి రూపొందించుకోవాలి.’
- అసోచామ్ ప్రధాన కార్యదర్శి డిఎస్ రావత్
‘్భరత స్టాక్, కరెన్సీ మార్కెట్లలో నెలకొన్న తాజా పరిస్థితులు మున్ముందు చక్కబడతాయి. ఆందోళన అక్కర్లేదు.’
- పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా
‘బ్రెగ్జిట్ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్‌లో నెలకొన్న ఒడిదుడుకులు భారతీయ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.’ - భారత ఎగుమతి సంస్థల సమాఖ్య
‘ఈయు నుంచి బ్రిటన్ వైదొలగడం వల్ల భారతీయ ఐటి రంగానికి సమీప భవిష్యత్తులో అనిశ్చితి తప్పదు.’
- నాస్కామ్ అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్
‘మార్కెట్లలో నెలకొంటున్న పరిస్థితులను దగ్గరగా గమనిస్తున్నాం. అవసరమైతే ఒడిదుడుకులను అడ్డుకునేలా చర్యలు తీసుకుంటాం.’
- మార్కెట్ రెగ్యులేటర్ సెబీ
‘కొన్ని దేశాల మార్కెట్లు ఒడిదుడుకులకు లోనైనప్పటికీ బ్రెగ్జిట్‌తో భారత్‌కు ఈయు, బ్రిటన్‌లలో మరిన్ని మార్కెట్ అవకాశాలు వస్తాయి.
- ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
‘బోలెడన్ని అనిశ్చితులకు దారితీసింది బ్రెగ్జిట్. యూరోపియన్ యూనియన్ ఇలాగే ఉంటుందా? మరే దేశమేదైనా వెళ్లిపోతుందా? అన్న అనుమానాలున్నాయి.’
- బయోకాన్ సిఎండి కిరణ్ మజుందార్ షా
‘బ్రెగ్జిట్ తర్వాత ఇప్పుడు బ్రిటన్‌లో మాకు మార్కెట్ అనుమతులు, సిబ్బంది నైపుణ్యం ప్రధానం. యుకెలోని మా సంస్థల వ్యాపారాన్ని సమీక్షించుకుంటాం.’
- టాటా సన్స్ అధికార ప్రతినిధి
‘్భరత్‌పై, భారతీయ సంస్థలపై బ్రెగ్జిట్ ప్రభావం పెద్దగా ఉండబోదు. అక్కడున్న మా గ్రూప్ సంస్థలపైనా ఎలాంటి ప్రభావం ఉండదు.’
- మహీంద్ర గ్రూప్ సిఎఫ్‌ఒ విఎస్ పార్థసారథి
‘పడిపోయిన పౌండ్ విలువ బ్రిటన్, యూరప్‌కు మరింత మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.’
- కాక్స్ అండ్ కింగ్స్ సిఎఫ్‌ఒ అనిల్ ఖండేల్‌వాల్
‘్భరతీయ కొనుగోలుదారులకు బ్రిటన్ నిర్మాణ రంగం అనువుగా మారొచ్చు. ఇదే సమయంలో భారతీయ నిర్మాణ రంగంలో ఎఫ్‌డిఐ, ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులకు విఘాతం కలగవచ్చు.’
- జెఎల్‌ఎల్ ఇండియా అధిపతి అంజు పూరి
‘బ్రెగ్జిట్‌తో లండన్‌లోని ఆర్థిక సేవల సంస్థలు మరో మార్కెట్‌కు తరలిపోయే అవకాశాలున్నాయి. పౌండ్ పతనం ప్రభావం భారత ఐటి పరిశ్రమపై వెంటనే పడొచ్చు.’
- టెక్ మదుపరి మోహన్‌దాస్ పాయ్

సెనె్సక్స్ క్లోజింగ్ టాప్-10 నష్టాలు
ఆగస్టు 24, 2015: 1,624.51 పాయింట్లు
జనవరి 21, 2008: 1,408.35 పాయింట్లు
అక్టోబర్ 24, 2008: 1,070.63 పాయంట్లు
మార్చి 17, 2008: 951.03 పాయింట్లు
మార్చి 3: 2008: 900.84 పాయింట్లు
జనవరి 22, 2008: 875.41 పాయింట్లు
జూలై 6, 2009: 869.65 పాయంట్లు
జనవరి 6, 2015: 854.86 పాయంట్లు
ఫిబ్రవరి 11, 2008: 833.98 పాయింట్లు
మే 18, 2006: 826.38 పాయింట్లు