బిజినెస్

డాక్టర్ రెడ్డీస్ షేర్ బైబ్యాక్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ఔషధరంగ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్.. 1,569.41 కోట్ల రూపాయల షేర్ బైబ్యాక్‌ను పూర్తి చేసింది. ఈ ఏడాది ఆరంభంలో మొదలుపెట్టిన ఈ షేర్ల కొనుగోలు ప్రక్రియలో భాగంగా దాదాపు 51 లక్షల షేర్లను తిరిగి రెడ్డీస్ ల్యాబ్ చేజిక్కించుకుంది. ఒక్కో షేర్‌ను 3,090.92 రూపాయల ధరతో మొత్తం 50,77,504 ఈక్విటీ షేర్లను 1,569.41 కోట్ల రూపాయలతో అందుకున్నట్లు మంగళవారం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ప్రకటించింది. షేర్ బైబ్యాక్‌కు ఈ ఫిబ్రవరిలో సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 1న బైబ్యాక్ ఆఫర్‌ను సంస్థ భాగస్వాములు కూడా అంగీకరించారు. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో, తెలంగాణలోని మిర్యాలగూడలో తయారీ కేంద్రాలున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా దువ్వాడలో ఆంకాలజీ ఫార్ములేషన్ తయారీ కేంద్రం కూడా ఉంది.