బిజినెస్

ఇలాంటి అవకాశం రాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 28: ‘నల్లధనం వివరాలను స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఇదే చివరి అవకాశం. దీన్ని ఉపయోగించుకుని నిశ్చింతగా ఉండండి.’ అని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వన్-టైమ్ కంప్లియెన్స్ విండో ద్వారా బయటికొచ్చిన ఈ నల్లధనం వివరాలను ఏ ఇతర దర్యాప్తు సంస్థలకో, అథారిటీలకో ఇవ్వబోమని స్పష్టం చేశారు. మంగళవారం ఇక్కడ పారిశ్రామిక సంఘాలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, పన్నుల శాఖ అధికారులు, నిపుణులతో జైట్లీ సమావేమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వన్-టైమ్ కంప్లియెన్స్ విండోపై ఉన్న సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. పన్నులు చెల్లించకుండా పోగేసిన అక్రమ సంపద వివరాలను తెలియజేసి, వాటికి సంబంధించిన పన్నులు సక్రమంగా చెల్లించేందుకు తద్వారా జరిమానాలను, జైలు శిక్షలను తప్పించుకునేందుకు నాలుగు నెలలపాటు ఈ వన్-టైమ్ కంప్లియెన్స్ విండోను మోదీ సర్కారు అమల్లోకి తెచ్చినది తెలిసిందే. ‘ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా ఆదాయాన్ని పొందుతున్నవారు. భారీగా అక్రమ సంపదను కలిగి ఉన్నవారు వెంటనే వాటి వివరాలను తెలియపరచండి. జరిమానాలు, జైలు శిక్షలు తప్పించుకుని ప్రశాంతంగా నిద్రపోండి. ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు.’ అని జైట్లీ సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. జూన్ 1న ఈ ప్రత్యేక విండోను కేంద్రం తెరిచింది. సెప్టెంబర్ 30న దీన్ని నిలిపివేస్తారు. ఈలోగా ఎవరైతే నల్లధనాన్ని కలిగి ఉంటారో? వారంతా దీన్ని ఉపయోగించుకుని పరిశుద్ధులు కావాలని జైట్లీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. లేకుంటే మున్ముందు తీవ్ర ఇబ్బందులేనని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే ఉండదన్నారు. తమ వద్ద ఉన్న అక్రమ సంపదలో 45 శాతాన్ని పన్ను, జరిమానాగా చెల్లించి దాన్ని సక్రమ సంపదగా మార్చుకోవాలని హితవు పలికారు. కాగా, ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్, చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా, ప్రధాన మంత్రి కార్యాలయంలో సహాయ మంత్రి జితేందర్ సింగ్ తదితరులు హాజరయ్యారు. ఈ ప్రత్యేక విండోపై పారిశ్రామిక, వాణిజ్య సంఘాలు, సిఎలు, ట్యాక్స్ నిపుణులతో చర్చించేందుకు రెవిన్యూ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి.
ఇదిలావుంటే నిరుడు 90 రోజులపాటు నిర్వహించిన ఇదే తరహా విండో ద్వారా విదేశాల్లోని 4,147 కోట్ల రూపాయల అక్రమ సంపద బహీర్గతమవగా, ఇందులో 30 శాతం పన్ను, 30 శాతం జరిమానాగా మొత్తం 60 శాతంగా 2,500 కోట్ల రూపాయల సొమ్ము ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇప్పుడు దేశీయంగా ఉన్న నల్లధనాన్ని వెలికి తీయడంలో భాగంగా 120 రోజులపాటు ప్రత్యేక విండోను తెచ్చారు. కాగా, అధికారంలోకి రాగానే నల్లధనం వ్యవస్థ పని పడతామన్న మోదీ సర్కారు ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ, అవి వడివడిగా పడటం లేదు. ఈ క్రమంలో ఈ ప్రత్యేక విండోలైనా తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించి పెట్టాలని కేంద్రం ఎంతో ఆశిస్తోంది. అందుకే వీటిపై ఉన్న అనుమానాలను తొలగించేలా తాజా సమావేశాన్ని నిర్వహించింది.

చిత్రం... స్వచ్ఛంద నల్లధన వివరాల ప్రకటన సదుపాయంపై నిర్వహించిన సమావేశంలో జైట్లీ తదితరులు