బిజినెస్

మార్కెట్‌కు వేతన పెంపు కిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 29: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపునకు మోదీ సర్కారు ఆమోదం పలకడం.. మదుపరులను పెట్టుబడుల వైపునకు నడిపించింది. అలాగే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) ఆమోదం పొందుతుందన్న అంచనాలూ కలిసొచ్చాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 215.84 పాయింట్లు పుంజుకుని 26,740.39 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 76.15 పాయింట్లు ఎగిసి 8,204 వద్ద నిలిచింది. కాగా, గత వారం బ్రెగ్జిట్ కారణంగా భారీ ఒడిదుడుకులకు లోనైన సూచీలు.. ఈ వారం లాభాల్లో నడుస్తున్నాయి. అంతకుముందు రెండు రోజుల్లోనూ సూచీలు లాభాల్లో కదలాడినది తెలిసిందే.