బిజినెస్

రికార్డు స్థాయిలో వేరుశనగ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 29: ఆంధ్ర రాష్ట్రంలో వేరుశనగ ఉత్పత్తి రికార్డు స్థాయిలో జరిగింది. మునుపెన్నడూ లేని ఉత్పత్తి సాధ్యమైంది. 2014-15లో రాష్ట్రంలో 4.93 లక్షల మెట్రిక్ టన్నుల వేరుశనగ ఉత్పత్తి కాగా, 2015-16లో 8.03 లక్షలకు పెరిగింది. అంతకుముందుతో పోల్చితే 3.10 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అదనంగా జరిగింది. హెక్టారుకు సరాసరి 1,027 కిలోల దిగుబడితో జాతీయ స్థాయిలో రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. 3,461 కిలోలతో తమిళనాడు మొదటి స్థానంలో, 2,415 కిలోలతో పశ్చిమ బెంగాల్ రెండోస్థానంలో ఉన్నాయి. కాగా, జిల్లాలవారీగా పరిశీలిస్తే ఖరీఫ్, రబీ కలుపుకొని హెక్టారుకు సగటు దిగుబడి 3,006 కిలోలతో కృష్ణా మొదటి స్థానం, అతి తక్కువ దిగుబడి 783 కిలోలతో అనంతపురం చివరి స్థానంలో నిలిచాయి. శ్రీకాకుళం 1,490, విజయనగరం 1,228, విశాఖపట్నం 1,569, తూర్పు గోదావరి 2,074, పశ్చిమ గోదావరి 2,354, గుంటూరు 2,655, ప్రకాశం 2,929, పొట్టిశ్రీరాములు నెల్లూరు 2,750, కర్నూలు 1,021, వైఎస్‌ఆర్ కడప 1,801, చిత్తూరు జిల్లాలో 1,280 కిలోల దిగుబడి వచ్చింది. కృష్ణా జిల్లాలో ఒక్క ఖరీఫ్‌లోనే రికార్డు స్థాయిలో 3,412 కిలోల దిగుబడి లభించడం గమనార్హం. మరోవైపు ఈ ఏడాది (2016-17) రాష్ట్రంలో వేరుశనగ సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని పెంచడానికి వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2014-15లో 8.74 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగవగా, 2015-16లో 7.75 లక్షల హెక్టార్లలోనే సాగైంది. అయినా దిగుబడి గణనీయంగా పెరిగింది. ఇక ఈ 2016-17 లో సాగు విస్తీర్ణం 8.92 లక్షల హెక్టార్లు, ఉత్పత్తి 9.28 లక్షల మెట్రిక్ టన్నులు లక్ష్యంగా వ్యవసాయ శాఖ నిర్ణయించింది.