బిజినెస్

వృద్ధికి ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: ఎప్పట్నించో వేచిచూస్తున్న వేతన పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం.. దేశ ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కోటి మందికిపైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనీర్లకు వేతనాన్ని పెంచాలని కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకున్న ప్రతిపాదనకు బుధవారం ఇక్కడ ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 7వ వేతనం సంఘం చేసిన ఈ ప్రతిపాదన ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనీర్ల వేతనం, అలవెన్సుల్లో మొత్తం పెంపు 23.55 శాతానికి చేరుతుంది. ఈ నేపథ్యంలో పెరిగిన జీతాలతో వినియోగదారుల కొనుగోళ్ల సామర్థ్యం పెరుగుతుందని, ఇది దేశ జిడిపి వృద్ధిని బలోపేతం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, సర్వీసెస్ రంగాలకు డిమాండ్ ఉంటుందని, ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 7.6 శాతంగా ఉన్న భారత జిడిపి వృద్ధిరేటు.. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 7.9 శాతానికి ఎగబాకేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ‘7వ వేతన సంఘం సిఫార్సులు అమలైతే కన్జ్యూమర్, సేవా రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. అలాగే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చి వృద్ధిరేటు పురోగతికి కారణమవుతుంది.’ అని ఐసిఆర్‌ఎ సీనియర్ ఆర్థికవేత్త అదితి నాయర్ అన్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో కేంద్రం సరైన నిర్ణయం తీసుకుందని కూడా మరికొందరు అభివర్ణిస్తున్నారు. ‘బ్రెగ్జిట్ కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల మధ్య 7వ వేతన సంఘం చేసిన సిఫార్సులు అమలు కావడం భారత్‌కు నిజంగా కలిసొచ్చే అంశం. వేతనాలు పెరిగితే కొనుగోళ్లతో వినియోగం కూడా పెరుగుతుంది. అదీగాక ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని వ్యక్తమవుతున్న అభిప్రాయాలూ వృద్ధికి సహకరించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత జిడిపి వృద్ధి 7.9 శాతంగా నమోదు కావచ్చన్నది మా అంచనా.’ అని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త డికె జోషి అన్నారు. ఇదిలావుంటే వేతనం పెంపుతో ఖజానాపై 1.02 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడనుండగా, జిడిపిలో ఇది దాదాపు 0.7 శాతంతో సమానం. ఈ ఏడాది జనవరి 1 నుంచే సిఫార్సులు అమల్లోకి రానున్నాయి.
అమ్మకాలు పెరుగుతాయ్: ఆటో పరిశ్రమ
7వ వేతన సంఘం సిఫార్సులు అమలు కావడం వల్ల ఆటో రంగ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ భావిస్తోంది. దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకితోపాటు హ్యుందాయ్, హోండా సంస్థలు తమ అమ్మకాల్లో వృద్ధి కనిపిస్తుందని అంచనా వేశాయి. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనీర్ల ఆటో కొనుగోళ్లు 25 శాతానికిపైగా పెరగవచ్చని మారుతి సుజుకి అభిప్రాయపడింది. తమ వినియోగదారుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు ప్రధానంగా ఉన్నారంది. నిరుడు వీరు కొనుగోలు చేసిన మారుతి వాహనాలు 2 లక్షలపైనని సంస్థ తెలిపింది.
రూ. 45 వేల కోట్లకు వినియోగ సామర్థ్యం
వేతన పెంపుతో దేశీయ వినియోగ సామర్థ్యం 45,110 కోట్ల రూపాయలకు చేరుతుందని ఇండియా రేటింగ్స్ అండ్ రిసెర్చ్ అంచనా వేసింది. తాజా ప్రభుత్వ నిర్ణయం.. పొదుపును కూడా పెంచుతుందని అభిప్రాయపడింది. ఇక పెరిగిన జీతాలతో ఉద్యోగులు, పెన్షనీర్లు జరిపే కొనుగోళ్లతో ఎక్సైజ్ సుంకం వసూళ్లు కూడా పెరుగుతాయని, ఆదాయ పన్ను వసూళ్లూ అధికమవుతాయని ఇండియా రేటింగ్స్ తెలిపింది.
రిటైలర్లలో హర్షాతిరేకాలు
షాపులు, మాల్స్, సినిమా హాల్స్‌ను నిరంతరం తెరిచి ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతివ్వడం పట్ల రిటైలర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ‘ప్రభుత్వ నిర్ణయంతో రిటైల్ రంగం నూతన స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆయా రాష్ట్రాలపై దీని విజయం ఆధారపడి ఉంటుంది.’ అని షాపర్స్ స్టాప్ మేనేజింగ్ డైరెక్టర్, కస్టమర్ కేర్ అసోసియేట్ గోవింద్ శ్రీఖండే పిటిఐతో అన్నారు. ‘ఇది స్వాగతించదగిన నిర్ణయం. అన్ని రాష్ట్రాలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తాయని ఆశిస్తున్నాం. 24 గంటలు షాపులు, మాల్స్, సినిమా హాల్స్ తెరిచి ఉండటం వల్ల వేలాది ఉద్యోగావకాశాలు వస్తాయి.’ అని వాల్‌మార్ట్ ఇండియా అధ్యక్షుడు, సిఇఒ క్రిష్ అయ్యర్ అన్నారు. ‘అందరికీ లాభించే నిర్ణయమిది. వ్యాపారులు, వినియోగదారులు, ప్రభుత్వం ఇలా అందరికీ దీనివల్ల ప్రయోజనం ఉంటుంది.’ భారత రిటైలర్స్ అసోసియేషన్ సిఇఒ కుమార్ రాజగోపాలన్ అన్నారు. పారిశ్రామిక సం ఘాలు అసోచామ్, ఫిక్కీ, సిఐఐ కూడా ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశాయ.
ద్రవ్యలోటు లక్ష్యంపై ప్రభావం?
ముంబయి: 7వ వేతనం సంఘం సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావచ్చేమోగానీ ఇది వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) ద్రవ్యలోటు లక్ష్యాన్ని ప్రభావితం చేస్తుందేమోనని ఎస్‌బిఐ రిసెర్చ్ అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనీర్లకు వేతనాలను పెంచడంతో ఖజానాపై 1.02 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని గుర్తుచేసింది.