బిజినెస్

ఖనిజ అనే్వషణ విధానానికి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 29: జాతీయ ఖనిజ అనే్వషణ విధానాని (ఎన్‌ఎమ్‌ఇపి)కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఖనిజాల అనే్వషణ కోసం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జిఎస్‌ఐ) గుర్తించిన 100 బ్లాకులను ప్రభుత్వం వేలం వేయవచ్చని ఓ సీనియర్ అధికారి అన్నారు. దేశంలో ఖనిజాల అనే్వషణకు ఈ నిర్ణయం ప్రోత్సాహాన్నిస్తుందని, ఇప్పటికే జాతీయ ఖనిజ అనే్వషణ ట్రస్టు(ఎన్‌ఎమ్‌ఇటి)ను కూడా కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు.

ఎట్టకేలకు కుదిరిన
కూలీ అగ్రిమెంట్
ౄ ఎఎంసి చైర్మన్ జోక్యంతో
సమసిన టెక్స్‌టైల్ పార్కు సమ్మె
ౄ పనుల్లో చేరతామని కార్మికుల ప్రకటన
సిరిసిల్ల, జూన్ 29: గత 42 రోజులుగా నలుగుతున్న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కు కార్మికుల సమ్మె సమస్య ఎట్టకేలకు పరిష్కారానికి నోచుకుంది. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి చొరవతో యజమానులు, కార్మిక సంఘాల ప్రతినిధులు బుధవారం ఇక్కడి చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 23న మంత్రి కె తారకరామారావు నేతృత్వంలో జరిగిన చర్చలలో కుదిరిన ఒప్పందాలపై రాతపూర్వకంగా అగ్రిమెంటుపై యజమానులు, కార్మిక సంఘ ప్రతినిధులు సంతకాలు చేశారు. మంత్రి సమక్షంలో చర్చలు జరిగినప్పటికీ అగ్రిమెంటు చేయనిదే తాము పనుల్లోకి వెళ్ళబోమని కార్మికులు, పనుల్లోకి వెళ్ళాకే అగ్రిమెంటు చేస్తామని యజమానులు విరుద్ధ ప్రకటనలు చేయడంతో సమ్మె ముగిసినా సమస్యగానే మిగిలిపోయంది. కార్మికులు విధుల్లోకి చేరకపోవడం, యూనిట్లలో ఉత్పత్తులు జరుగలేదు. ఈ నేపథ్యంలో అగ్రిమెంటు చేయడంతో కార్మికులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. ఇక ఎప్పుడు యూనిట్లు తెరిస్తే అప్పుడే పనుల్లోకి వెళ్తామని కార్మికులు ప్రకటించారు. కాగా, మంత్రి సమక్షంలో జరిగిన ఒప్పందాలలో 180 ఆర్‌పిఎం కంటే తక్కువ ఉన్న ఫ్యాక్టరీలలో పది పిక్కులకు 0.36.5 పైసల కూలీ చెల్లించాలని, 180 ఆర్‌పిఎం కంటే ఎక్కువ ఉన్న ఫ్యాక్టరీలలో పది పిక్కులకు 0.35.5 పైసల కూలీ చెల్లించాలని నిర్ణయించారు. ఈ కూలీ ఒప్పందం కాలపరిమితి రెండు సంవత్సరాలు. ఈ నెల 29వ తేదీ నుండి 2018 సంవత్సరం జూన్ 28వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ చర్చలలో జిందం చక్రపాణితోపాటు కార్మిక సంఘాల పక్షాన సిఐటియు నాయకులు మూషం రమేశ్, పంతం రవి, కూచన శంకర్, కోడం రమణ, అన్నల్‌దాస్ గంగాధర్, యజమానుల పక్షాన కళ్యాడపు సుభాష్, అంకారపు శ్రీహరి, బూట్ల సుదర్శన్, అన్నల్‌దాస్ అనిల్, బొద్దుల సుదర్శన్, పర్శరాములు పాల్గొన్నారు.

పన్ను ఎగవేతదారులకు వరం.. ఆదాయ వెల్లడి పథకం

ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ ఓంకారేశ్వర్

కాకినాడ, జూన్ 29: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయ వెల్లడి పథకం-2016 (ఐడిఎస్)ను ఆదాయ పన్నులు చెల్లించనివారు వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ విశాఖ కమిషనరేట్-2 ఓంకారేశ్వర్ చిదార సూచించారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆదాయ పన్ను చెల్లించని వారు జూన్ 1నుండి సెప్టెంబరు నెలాఖరు వరకు నాలుగు నెలల కాలంలో తప్పనిసరిగా ప్రభుత్వానికి టాక్స్‌లు చెల్లించాలని సూచించారు. ఈ పథకం కింద అసలులో 45 శాతం పన్ను చెల్లిస్తే వారిపై ఏ విధమైన విచారణలు, దర్యాప్తులు, తనిఖీలు ఉండవన్నారు. అయతే ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడి, క్రిమినల్ అరోపణలు ఎదుర్కొంటున్నవారికి ఈ పథకం వర్తించదన్నారు. పన్ను చెల్లింపుదారులు ఫారం-1ను డిజిటల్ సంతకం కింద ఎలక్ట్రానిక్ రూపంలోగాని, ముద్రణ రూపంలోగాని ప్రిన్సిపల్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కంటాక్స్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఫారం-2లో సదరు కార్యాలయం నుండి రశీదు పొందాలని, ఫారం-3లో పన్ను సర్‌ఛార్జి, పెనాల్టీ చెల్లింపు వివరాలను పొందుపరచాల్సి ఉంటుందని చెప్పారు. చెల్లింపు వివరాలను తెలియజేసిన 15రోజుల్లోగా ప్రిన్సిపల్ కమిషనర్ ఫారం-4 ద్వారా స్కీమ్ సర్ట్ఫికెట్ ధ్రువీకరణను అందజేస్తారని తెలిపారు.

2 నుండి టిఎస్ ఎడ్‌సెట్ వెబ్ ఆప్షన్లు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ కళాశాలల్లో బిఇడి కోర్సులో చేరేందుకు ఉన్నత విద్యామండలి అడ్మిషన్ల నోటిఫికేషన్ జారీ చేసింది. వచ్చే నెల 2 నుండి 11వ తేదీ వరకు సర్ట్ఫికేట్ల వెరిఫికేషన్‌కు వీలు కల్పించింది. రాష్టవ్య్రాప్తంగా 13 హెల్ప్‌లైన్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. జూలై 2న ఇంగ్లీషు 1 నుండి 569 ర్యాంకు వరకు, పిఎస్ 1 నుండి 2,575 ర్యాంకు వరకు హాజరుకావల్సి ఉంటుంది. అలాగే 3న మాథ్స్ 1 నుండి 4 వేల ర్యాంకు వరకూ, 4న మాథ్స్ 4 వేల ర్యాంకు నుండి 7,878 వరకు, 5న బయాలజీ 1 నుండి 4,500 ర్యాంకు వరకు, 8న బయాలజీ 4,501 నుండి 10,486 ర్యాంకు వరకు, 9న సోషల్ 1 నుండి 4 వేల ర్యాంకు వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 10న సోషల్ 4,001 నుండి 11, 500 వరకు, 11న 11,501 నుండి 19,318 ర్యాంకు వరకు సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. స్పెషల్ కేటగిరీకి ప్రత్యేక షెడ్యూలును ఇచ్చారు. కాగా, 2, 3, 4 తేదీల్లో సర్ట్ఫికెట్ల పరిశీలన చేసుకున్నవారు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు. అలాగే 5, 8 తేదీల్లో పరిశీలన చేసుకుంటే 10, 11 తేదీల్లో, 9, 10 తేదీల్లో చేసుకుంటే 11, 12 తేదీల్లో, 11న అయతే 12, 13 తేదీల్లో వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి.
పాలిటెక్నిక్‌లో మిగిలిపోయిన 24,948 సీట్లు
3 నుండి కౌనె్సలింగ్, 6న సీట్ల కేటాయింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణలో మిగిలిపోయిన పాలిటెక్నిక్ సీట్లకు మలి దశ అడ్మిషన్లకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. తొలి దశ అడ్మిషన్లలో 24,948 సీట్లు మిగిలిపోయాయి. ఈ సీట్లకుగాను జూలై 3 నుండి సర్ట్ఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 3, 4 తేదీల్లో ఆప్షన్లకు వీలుంటుంది. 6న సీట్ల అలాట్‌మెంట్ జరుగుతుంది. కాలేజీలకు 8న రిపోర్టు చేసి ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ప్రభుత్వ కాలేజీల్లో 3,244, ఎయిడెడ్‌లో 116, ప్రైవేటులో 21,588 సీట్లు మిగిలిపోయాయి.
ఎంసెట్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు మరో అవకాశం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 29: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల షెడ్యూలును ప్రభుత్వం ప్రకటించింది. అయితే గతంలో ఎమ్సెట్ సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకాని అభ్యర్థులకు మరో అవకాశం కల్పించారు. అటువంటి వారంతా జూలై 5, 6 తేదీల్లో సర్ట్ఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చు. 5, 6 తేదీల్లో 1 నుండి 45 వేల ర్యాంకు వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేయాలి, 7, 8 తేదీల్లో 45,001 నుండి 90 వేల ర్యాంకు వరకు, 9వ తేదీన 90,001 నుండి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేయాలి. 10వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునేందుకు వీలు కల్పిస్తారు. 14వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుంది. కాగా, స్పెషల్ కేటగిరి అభ్యర్థులు 5, 6 తేదీల్లో సాంకేతిక విద్యా భవన్‌లో హాజరుకావల్సి ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ ఎంవి రెడ్డి, అడ్మిషన్స్ కన్వీనర్ డాక్టర్ బి శ్రీనివాసరావు చెప్పారు.
50,641 మంది హాజరు
సర్ట్ఫికెట్ల పరిశీలనకు 29వ తేదీ వరకూ 50,641 మంది హాజరయ్యారని కమిషనర్ ఎంవి రెడ్డి చెప్పారు. 68 వేల ర్యాంకు వరకు 43,630 మంది, 68,001 నుండి 80 వేల ర్యాంకు వరకు 7,011 మంది హాజరయ్యారని చెప్పారు.

ఈసారి కరెంట్ ఖాతా లోటు
1 శాతం దిగువకు రావచ్చు: సిఇఎ
హైదరాబాద్, జూన్ 29: కరెంట్ ఖాతా లోటు (సిఎడి) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) 1 శాతం దిగువనకు వచ్చే అవకాశాలున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యన్ అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తక్కువగా ఉండ టం దీనికి ప్రధాన కారణమన్నారు. భారత్ ముడి చమురు దిగుమతులపై ఆధారపడుతు న్నది తెలిసిందే. బుధవారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేఖరులతో మాట్లాడారు.

ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య సలహా వేదిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూన్ 29: ఆరోగ్య బీమా రంగంలో ఐసిఐసిఐ లాంబార్డ్ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పాలసీదారుడికి ఏ మేరకు చికిత్స అందుతుందనే విషయమై అవగాహన కల్పిచేందుకు ఆరోగ్య సలహా అనే కొత్త వేదికను ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ అధిపతి అమిత్ భండారి తెలిపారు. ఆరోగ్య బీమా ఉన్న వ్యక్తి అవసరమైన సమయాల్లో ఎక్కడ ఏ మేర చికిత్సకు ఖర్చవుతుంది తదితర వివరాలను ఆరోగ్య బీమా సలహాదారు పాలసీదారుడికి తెలియజేస్తాడు. ఈ విధానాన్ని హైదరాబాద్‌లో 141 ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టారు.