బిజినెస్

ఇక ఎస్‌బిఐ ఇఎమ్‌ఐలతో ఫ్లిప్‌కార్ట్ కొనుగోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 1: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌తో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ టై-అప్ అయ్యింది. దీంతో ఇక ఎస్‌బిఐ ఖాతాదారులు నెలసరి వాయిదాల్లో (ఇఎమ్‌ఐ) ఫ్లిప్‌కార్ట్ ద్వారా కన్జ్యూమర్ డ్యూరబుల్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. అయితే వ్యక్తిగత రుణ వడ్డీరేటు (14 శాతం) వర్తిస్తుంది. ‘ఇలాంటి ఓ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. దీనివల్ల అటు ఫ్లిప్‌కార్ట్‌కు, ఇటు ఎస్‌బిఐకి ప్రయోజనమే.’ అని టై-అప్ సందర్భంగా శుక్రవారం ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అన్నారు. ఎస్‌బిఐ డెబిట్ కార్డు ఉన్నవారూ ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో షాపింగ్ చేస్తున్న సమయంలోనే కస్టమర్ ఇఎమ్‌ఐ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. కొన్న వస్తువుకు ఎప్పటిలోగా డబ్బు చెల్లిస్తారనేదానిపై మూడు నెలల నుంచి ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది మధ్య గడువును నిర్ణయించుకోవాలి. దీని ఆధారంగానే ఇఎమ్‌ఐ నిర్ధారణ జరుగుతుంది. ఆ తర్వాత తొలి ఇఎమ్‌ఐ చెల్లింపు జరిగిన తర్వాత ఈ లావాదేవీ (కొనుగోలు ప్రక్రియ) ముగుస్తుంది. కాగా, 5 వేల రూపాయల కంటే ఎక్కువ విలువ కలిగిన వస్తువుల కొనుగోళ్లకే ఇఎమ్‌ఐ ఆప్షన్ వర్తిస్తుంది. ఇదిలావుంటే శుక్రవారం 61వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఎస్‌బిఐ.. ఈ సందర్భంగా ఖాతాదారులకు పలు రకాల ప్రోత్సాహకాలను, మరికొన్ని సదుపాయా లను ప్రకటించింది.
పేమెంట్స్ బ్యాంక్ కోసం..
న్యూఢిల్లీ: పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు వీలుగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బిఐ ఒప్పందం చేసుకున్నాయి. శుక్రవారం ఈ జాయింట్ వెంచర్ ఒప్పందంపై ఇరు సంస్థలు సంతకాలు చేశాయి. నిరుడు ఆగస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) నుంచి పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు ఆమోదం అందుకున్నది తెలిసిందే. కాగా, పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులు పొందినప్పటికీ, ఆ ఆలోచనను చోళమండలం, సన్‌ఫార్మా, ఐడిఎఫ్‌సి జాయింట్ వెంచర్లు విరమించుకున్నది తెలిసిందే.