బిజినెస్

వెండి ధరల దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: వెండి ధరలు దూసుకుపోతున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గత వారం మొత్తంగా 3,000 రూపాయలకుపైగా పెరిగిన ధర.. సోమవారం ఒక్కరోజే 28 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 2,155 రూపాయలు ఎగిసింది. తద్వారా కిలో ధర 47,715 రూపాయల వద్దకు చేరింది. ఈ ఏడాది ఆరంభం నుంచి దాదాపు 44 శాతం ధర పెరగడం గమనార్హం. కాగా, వెండి ధరలు పెరగడానికి కారణం యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో తలెత్తిన విపత్కర పరిణామాల మధ్య మదుపరులు తమ పెట్టుబడులకు బంగారం, వెండిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారని బులియన్ ట్రేడర్లు విశే్ల షిస్తున్నారు. అలాగే పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాం డ్ ఏర్పడిందంటున్నారు. దీంతో కొనుగోళ్లు పెరిగాయని పేర్కొంటున్నారు.