బిజినెస్

శ్రీసిటీలో కొబెల్కో, పైలాస్ అదనపు యూనిట్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, జూలై 6: నెల్లూరు, చిత్తూరు జిల్లాల సరిహద్దులోని శ్రీసిటీలో జపాన్ దేశానికి చెందిన కొబెల్కో ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమిటెడ్, పైలాస్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమల అదనపు ఉత్పత్తి యూనిట్లకు బుధవారం ప్రారంభోత్సవం జరిగింది. కొబెల్కో కొత్త యూనిట్లను ఆ సంస్థ డైరెక్టర్ సటోరు హోషినా ప్రారంభించగా, పైలాస్ అదనపు యూనిట్‌ను ఆ సంస్థ పైలాస్ గ్రూప్ ప్రెసిడెంట్ యుకిహికోషిమాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ కొబెల్కో, పైలాస్ రెండూ కూడా శ్రీసిటీలో అడుగుపెట్టిన మొట్టమొదటి జపాన్ దేశ పరిశ్రమలని, రెండూ తమ యూనిట్లను విస్తరించడం సంతోషదాయకమన్నారు. కొబెల్కోకు సంబంధించి యేడాదిలో ఇది రెండవ యూనిట్ విస్తరణ అని తెలిపారు. ఈ పరిశ్రమలు మరింత వ్యాపారాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ యూనిట్ల విస్తరణ శ్రీసిటీ ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నందున ఈ తరహా పరిశ్రమల ఉత్పత్తులకు మరింత డిమాండ్ పెరుగుతుందన్నారు. జపాన్‌లోని కొబెల్కో కన్‌స్ట్రక్షన్ ఎక్యూప్‌మెంట్ కంపెనీకి అనుబంధ సంస్థ అయిన కొబెల్కో ప్లేట్ ప్రాసెసింగ్ ఇండియా లిమెటెడ్‌లో స్టీల్ ప్లేట్ల తయారీ జరుగుతుందని తెలిపారు. ఇక పైలాస్ జపాన్ గ్రూపునకు చెందిన పైలాస్ ఇండియా ఆటోమొబైల్ విడిభాగాల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ. ఇక్కడ కార్లలో వినియోగించే కూల్ స్ప్రింగ్‌లు, ప్లాట్ స్ప్రింగ్‌లు, వైర్లు, మెటల్, ప్లాస్టిక్ పాస్టనర్‌లు తయారవుతాయని చెప్పారు.

శ్రీసిటీలో జపాన్‌కు చెందిన కొబెల్కో సంస్థ ప్రతినిధులు తమ
అదనపు యూనిట్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం