బిజినెస్

టామ్‌కామ్‌ని విస్తరిస్తాం: కెటిఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: గల్ఫ్‌లోని తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు భరోసా ఇచ్చారు. తెలంగాణలో ఉపాధి కల్పనకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు. పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలంగాణ బిడ్డలను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గల్ఫ్‌కు వెళ్లే యువతకు చట్టబద్ధంగా, పక్కా జీవనోపాధికి హామీ ఇస్తూ ఉద్యోగాలు కల్పించే తెలంగాణ ఒవర్‌సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ (టామ్‌కామ్) లిమిటెడ్‌ని మరింత విస్తరిస్తామని చెప్పారు. సైబరాబాద్ కమీషనరేట్ గచ్చిబౌలిలో శుక్రవారం టామ్‌కామ్ నిర్వహించిన కార్యక్రమంలో కెటిఆర్ పాల్గొన్నారు. టామ్‌కామ్ ద్వారా గల్ఫ్‌లో ఉపాధి పొందిన 250 మందికి వీసాలు అందజేశారు. కాగా, టామ్‌కామ్ గత ఫిబ్రవరిలో దుబాయ్‌లో ఐదు కంపెనీలతో ఉపాధి కోసం ఎమ్‌ఒయులను కుదుర్చుకున్నది. ఆయా కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు జిల్లాల్లో జరిగిన ఇంటర్వ్యూల్లో 250 మందికి మొదటి దశగా ఉపాధి కల్పనకు ముందుకు వచ్చారు. అయతే త్వరలోనే మరో 500 మందికి ఉపాధి కల్పించనున్నట్టు టామ్‌కామ్ అధికారులు మంత్రికి ఈ సందర్భంగా తెలిపారు.
ఒకవైపు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచుతూ మరో వైపు విదేశాల్లో ఉపాధి పొందేందుకు వెళ్లే వారికి సహకారం అందించనున్నట్టు కెటిఆర్ చెప్పారు. దీనిలో భాగంగానే గల్ఫ్ ఏజెంట్ల మోసాలను అరికట్టేలా టామ్‌కామ్ ద్వారా ఉపాధి కల్పిస్తామని స్పష్టం చేశారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారు చట్టబద్ధంగానే వెళ్లేలా చర్యలు తీసుకుంటామని కెటిఆర్ తెలిపారు. గల్ఫ్‌తోపాటు విదేశాల్లో ఉన్న తెలంగాణ పౌరులకు భరోసా కల్పించేలా ఎన్‌ఆర్‌ఐ పాలసీ రూపొందిస్తామన్నారు. దీనికోసం ఇప్పటికే ముసాయిదా సిద్ధం అయిందని, ఈనెల 16న ఎన్‌ఆర్‌ఐ సంఘాలు, నిపుణులతో సమావేశం నిర్వహించి ముసాయిదాపై సలహాలు, సూచనలు స్వీకరిస్తామని తెలిపారు.
ఇదిలావుంటే గల్ఫ్‌లో మరణించిన నిజామాబాద్ వాసి నర్సయ్య కుటుంబానికి జజీరా ఏమిరేట్స్ పవర్ కంపెనీ ఇచ్చిన 40 లక్షల 15 వేల రూపాయల చెక్కును ఈ సమావేశంలో అందజేశారు. చట్టబద్ధమైన మార్గాల్లో వెళ్లేవారికి ఇలాంటి భరోసా కంపెనీలు, ప్రభుత్వం కల్పిస్తాయని, అక్రమ దారుల్లో అక్కడికి వెళ్లి కష్టాలు కొనితెచ్చుకోవద్దని కెటిఆర్ సూచించారు. కాగా, సహాయం అందించిన కంపెనీ ప్రతినిధి కిశోర్‌ను కెటిఆర్ అభినందించారు. సమావేశంలో హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది, టామ్‌కామ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
దళిత పారిశ్రామికవేత్తలు రావాలి
మరోవైపు బడుగు బలహీన వర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధాన లక్ష్యమని కెటిఆర్ స్పష్టం చేశారు. దళిత్ ఇండియాస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (డిక్కి)తో కెటిఆర్ శుక్రవారం భేటీ అయ్యారు. పారిశ్రామిక విధానం ద్వారా తెలంగాణ రాష్ట్రానికి అనేక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే బలహీన వర్గాలకు సంపద, ఉపాధి సృష్టించేత వరకు వీటికి సార్థకత లేదని కెటిఆర్ అన్నారు. బలహీన వర్గాల నుంచి ఎంత మందిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తారని ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నకు సగర్వంగా సమాధానం చెప్పే దిశగా తెలంగాణ పరిశ్రమల శాఖ ముందుకు పోతున్నదని అన్నారు.