బిజినెస్

కస్టమర్లకు రూ. 251 స్మార్ట్ఫోన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: నొయిడాకు చెందిన రింగింగ్ బెల్స్ సంస్థ.. శుక్రవారం తమ ప్రతిష్ఠాత్మక చౌక మొబైల్‌ఫోన్ ‘ఫ్రీడమ్ 251’ పంపిణీని ప్రారంభించింది. హర్యానా, పశ్చిమ బెంగాల్, బీహార్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఫోన్లు ఆర్డర్ చేసిన కస్టమర్లకు అందించింది. డిస్ట్రిబ్యూటర్లు, కొరియర్ల ద్వారా తొలి విడతలో భాగంగా 2,240 ఫోన్లను కస్టమర్లకు పంపించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయెల్ పిటిఐకి తెలిపారు. శనివారం ఢిల్లీ, పంజాబ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల కస్టమర్లకు 2 వేల ఫోన్లను పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం ఉత్తరప్రదేశ్‌లో 760 ఫోన్లు ఇస్తామన్నారు. కస్టమర్ల నుంచి ఫోన్ ధర రూ. 251తోపాటు మరో రూ. 40ని డెలివరీ చార్జీగా తీసుకుంటున్నామని వివరించారు. కాగా, గురువారం ఈ సంస్థ సరికొత్త స్మార్ట్ఫోన్ మోడళ్లను మార్కెట్‌కు పరిచయం చేయగా, 9,990 రూపాయల ధరతో ఓ ఎల్‌ఇడి టెలివిజన్‌నూ ఆవిష్కరించింది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
సెనె్సక్స్ 75, నిఫ్టీ 15 పాయింట్లు క్షీణత
ముంబయి, జూలై 8: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 74.59 పాయింట్లు క్షీణించి 27,126.90 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 14.70 పాయింట్లు పడిపోయి 8,323.20 వద్ద నిలిచింది. వచ్చే వారం నుంచి ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) సంబంధించి ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించనుండటంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. వీటికితోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడంతో భారత స్టాక్ మార్కెట్లకు నష్టాలు తప్పలేదు.

సౌత్ ఇండియన్ బ్యాంక్ లాభం రూ. 95 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 8: ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ సౌత్ ఇండియన్ బ్యాంక్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 45.7 శాతం ఎగిసింది. మొండి బకాయిలు పెరిగినప్పటికీ 95 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 65.2 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఇక ఆదాయం విషయానికొస్తే ఈసారి 1,620.7 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 1,480.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం స్టాక్ ఎక్స్‌చేంజ్‌లకు సౌత్ ఇండియన్ బ్యాంక్ వర్గాలు తెలియజేశాయి.

8కె మైల్స్ లాభం రూ. 24 కోట్లు
ముంబయి, జూలై 8: సెక్యూర్ క్లౌడ్ సొల్యూషన్స్, మేనేజ్డ్ సర్వీసెస్ ప్రొవైడర్ 8కె మైల్స్ సాఫ్ట్‌వేర్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్-జూన్) నిరుడుతో పోల్చితే ఏకంగా 150 శాతం పెరిగింది. ఈసారి 24.15 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 9.65 కోట్ల రూపాయలకే పరిమితమైంది. ఆదాయం కూడా అంతే స్థాయిలో పుంజుకుంది. గతంతో చూస్తే 105 శాతం వృద్ధితో ఈ ఏప్రిల్-జూన్ వ్యవధిలో 103.89 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం ఇక్కడ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ వెంకటాచారి తెలిపారు.