బిజినెస్

మాల్యాకు కొత్త చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: బ్యాంకులకు రుణాల ఎగవేత కేసుల్లో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు కొత్త చిక్కు వచ్చిపడింది. గతంలో ఆయన నిర్వహించి బ్రిటన్‌కు చెందిన డియాజియోకు విక్రయించిన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. సంస్థకు చెందిన 1225.3 కోట్ల రూపాయల నిధులను మాల్యా చాలాకాలంగా మూతపడిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్, తన ఫార్ములా వన్ రేస్ టీమ్‌తో పాటు మరి కొన్ని సంస్థలకు దారి మళ్లించారని ఆ కంపెనీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ సొమ్మును తిరిగి రాబట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని కంపెనీ బోర్డు యునైటెడ్ స్పిరిట్స్ కంపెనీ యాజమాన్యానికి సూచించింది. కాగా, తాజాగా యునైటెడ్ స్పిరిట్స్ బైటపెట్టిన అంశాలతో అప్రమత్తమైన మార్కెట్ రెగ్యులేటర్ సెబి రంగంలోకి దిగి ఈ అంశంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించింది. యునైటెడ్ స్పిరిట్స్ వెల్లడించిన అంశాలు తమ దృష్టికి వచ్చాయని సెక్యూరిటీస్ మార్కెట్ నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే విషయాన్ని తాము పరిశీలిస్తున్నామని సెబి ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మాల్యాకు అత్యంత సన్నిహితులైన వారిపైన, మాల్యా కు చెందిన గ్రూపునకు సంబంధించిన వివిధ కంపెనీల సీనియర్ అధికారులు సహా, కొన్ని కంపెనీలకు చెందిన మాజీ ఆడిటర్లపైన కూడా తాము నిఘా పెట్టినట్లు ఆ అధికారి చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న తీవ్రమైన ఆర్థిక నేరాల దర్యాప్తు కార్యాలయం (ఎస్‌ఎఫ్‌ఐఓ) ఇప్పటికే మాల్యాకు సంబంధించిన వివిధ కేసుల్లో దర్యాప్తు జరుపుతున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దృష్టికి కూడా తీసుకెళ్తున్నట్లు సెబి అధికారి చెప్పారు.
ఆరోపణలు తోసిపుచ్చిన మాల్యా
అయితే గత కొన్ని నెలలుగా లండన్‌లోనే ఉంటున్న విజయ్ మాల్యా యునైటెడ్ స్పిరిట్స్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ లావాదేవీలన్నీ చట్టబద్ధంగా, బోర్డుకు తెలిసే జరిగినవని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.