బిజినెస్

స్టాక్ మార్కెట్లకు మిశ్రమ ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 13: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ స్వల్పంగా 7.04 పాయింట్లు పెరిగి 27,815.18 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 1.55 పాయింట్లు పడిపోయి 8,519.50 వద్ద నిలిచింది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస లాభాలను అందుకుంటున్నది తెలిసిందే. ఈ క్రమంలో సెనె్సక్స్ లాభపడగా, నిఫ్టీ అతి స్వల్పంగా నష్టపోయింది. ఇక మెటల్, ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్, ప్రభుత్వరంగ సంస్థల షేర్లు 1.83 శాతం నుంచి 0.28 శాతం మేర లాభపడ్డాయి. అయితే స్మాల్-క్యాప్ సూచీ 0.82 శాతం, మిడ్-క్యాప్ సూచీ 0.55 శాతం మేర నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభపడ్డాయి. 0.84 శాతం నుంచి 0.37 శాతం మేర లాభపడ్డాయి. అటు ఐరోపా మార్కెట్లూ లాభాల్లో కదలాడాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ సూచీలు 0.35 శాతం నుంచి 0.06 శాతం మేర పెరిగాయి.

పవన విద్యుత్ టర్బైన్
తయారీదారుల సంఘం చైర్మన్‌గా సర్వేష్

హైదరాబాద్, జూలై 13: ది ఇండియన్ విండ్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చైర్మన్‌గా ఆర్‌ఆర్‌బి ఎనర్జీ సహాయ ఎండి సర్వేష్ కుమార్, వైస్ చైర్మన్‌గా చింతన్ షా, సెక్రటరీ జనరల్‌గా డివి గిరి ఎన్నికైనట్లు ఆ సంస్థ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. దేశంలో పవన విద్యుత్ రంగంలో టర్బైన్ల తయారీకి ఈ సంస్థ కృషి చేస్తున్నట్లు కొత్త చైర్మన్ సర్వేష్ కుమార్ తెలిపారు. తమ సంస్థను 18 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంస్థ ఆర్థిక, విద్యుత్, సంప్రదాయేతర ఇంధన వనరులు, పర్యావరణ మంత్రిత్వ శాఖలు, రెగ్యులరేటరీ కమిషన్లు, కేంద్ర విద్యుత్ అథారిటీ, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్లతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు.

ఓలాతో వయా డాట్‌కామ్ భాగస్వామ్యం

హైదరాబాద్, జూలై 13: ఓమీ చానల్ ఆన్‌లైన్ ట్రావెల్, అసిస్టెంట్ ఈ కామర్స్ కంపెనీ వయా డాట్ కామ్ ద్వారా దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన రవాణా మొబైల్ యాప్ ఓలాతో భాగస్వామ్యం చేసుకుంది. తద్వారా 75 వేల మందికిపైగా ట్రావెల్ ఏజెంట్లు, లక్షలాది మంది వినియోగదారులు ఓలా రైడ్స్‌ను ఇప్పుడు వయా డాట్‌కామ్ ప్లాట్‌ఫాంపై బుక్ చేసుకోవచ్చునని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ స్వామినాథన్ వేదారణ్యం తెలిపారు.

గ్రామ విదియాల్‌ను టేకోవర్ చేసిన ఐడిఎఫ్‌సి

హైదరాబాద్, జూలై 13: మైక్రో ఫైనాన్స్ సంస్థ గ్రామ విదియాల్‌ను ఐడిఎఫ్‌సి బ్యాంకు టేకోవర్ చేసింది. నూరు శాతం షేర్ కొనుగోలు ఒప్పందంపై సంతకాలు చేసింది. టేకోవర్ పూర్తయిన తర్వాత గ్రామ విదియాల్ ఐడిఎఫ్‌సి బ్యాంకుకు పూర్తి అనుబంధ సంస్థగా మారుతుంది. ఈ అక్విజేషన్ ద్వారా ఐడిఎఫ్‌సి బ్యాంకు తక్షణమే 1.2 మిలియన్ల గ్రామీణ, సెమీ అర్బన్ గృహాలకు చేరువవుతుంది. ఏడు రాష్ట్రాల్లో 65 జిల్లాల్లో 319 ప్రాంతాలకు ఐడిఎఫ్‌సి సేవలు అందనున్నట్లు ఈ బ్యాంకు ఎండి డాక్టర్ రాజీవ్ లాల్ తెలిపారు.