బిజినెస్

హైటెక్ సిటీలో కొత్తగా మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించే బాధ్యతను రాష్ట్ర ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు అప్పగించింది. 50 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు. గతంలో టిడిపి హయాంలో నానక్‌రాంగూడ వద్ద 75 ఎకరాల విస్తీర్ణంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను నెలకొల్పారు. ఇందులోకి అన్నిరకాల అంతర్జాతీయ సంస్థలు వచ్చాయి. ప్రస్తుతం స్థలం అందుబాటులో లేదు. దీంతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్స్యూరెన్స్ రంగాల నుంచి స్థలం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి వస్తోంది. ఫలితంగా మరో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నిర్మాణానికి తెలంగాణ సర్కారు సిద్ధమైంది. కాగా, ముంబయి, అహ్మదాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ను తలదనే్న విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో సంపూర్ణ వౌలిక సదుపాయాలతో నిర్మించనున్నారు. గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీకి అంతర్జాతీయంగా మంచి పేరుంది. కొత్త ఫైనాన్షియల్ జిల్లాలో బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల సంస్థలకు స్థలాన్ని కేటాయిస్తారు. తెల్లాపూర్, పుప్పలగూడ, నాగులాపల్లి ప్రాంతాల్లో అనువైన స్థలం కోసం తెలంగాణ పారిశ్రామిక వౌలిక సదుపాయాల సంస్థ ఆనే్వషిస్తోంది. తెలంణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ద్వారా కొత్త ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకూ ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది.