బిజినెస్

రిలయన్స్ లాభం రూ. 7,113 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్- జూన్)లో గతంతో పోల్చితే 24.1 శాతం ఎగిసి 7,113 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే త్రైమాసికంలో 6,024 కోట్ల రూపాయల లాభాన్ని రిలయన్స్ అందుకుంది. కాగా, ఈసారి లాభంలో 2,378 కోట్ల రూపాయలు రిలయన్స్ నగదు నిల్వలపై వచ్చిన ఆదాయమే కావడం గమనార్హం. అయితే ఆదాయం మాత్రం గతంతో పోల్చితే 13.4 శాతం పడిపోయి ఈసారి 71,451 కోట్ల రూపాయలుగానే నమోదైంది. పెట్రోలియం ఉత్పత్తులు, ముడి చమురు ధరల పతనమే దీనికి కారణమని శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక సంస్థ రుణభారం ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు 1,80,388 కోట్ల నుంచి 1,86,692 కోట్ల రూపాయలకు పెరిగింది. అలాగే నగదు నిల్వలు మాత్రం ఇదే సమయంలో 89,966 కోట్ల నుంచి 90,812 కోట్ల రూపాయలకు పెరిగాయి.