బిజినెస్

ఆలయాలకు సౌర కాంతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 15: అందుబాటులో ఉన్న ఇంధన/శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తేవడం ద్వారా పర్యావరణ పరిరక్షణతోపాటు ఖర్చును పొదుపు చేయగలుగుతామని ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ అన్నారు. శుక్రవారం ఇక్కడ బ్రాహ్మణ వీధిలోని దేవాదాయ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎనర్జీ ఎఫీషియన్సీ మిషన్ సిఇఒ ఎ చంద్రశేఖర్ రెడ్డి తదితరులతో కలిసి విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ జగ్గయ్యపేటలో 50 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ యూనిట్‌ను చేపట్టనున్నట్లు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణ పనులలో భాగంగా చర్యలు చేపట్టే ఇంధన/శక్తి, సామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగంలోకి తేవడానికి చంద్రశేఖర రెడ్డి ఒక ఆడిట్ చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని 7 ప్రధాన దేవాలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, దుర్గామల్లేశ్వర, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఆలయాలలో విద్యుత్ వినియోగం తదితర శక్తి సామర్థ్యాలపై ఆడిట్‌ను చేపట్టడం జరిగిందన్నారు. విద్యుత్ వినియోగంలో సోలార్ ఎనర్జీని ప్రవేశపెట్టడంతోపాటు ప్రస్తుత విద్యుత్ సరఫరా వౌలిక వసతులు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, ఎసిలు, విద్యుత్ మోటార్లు, అన్న, ప్రసాదాలు తయారు చేసే చోటు, స్విచ్ బోర్డు నిర్వహణ , సత్రాలలో వినియోగించే ఎలక్ట్రికల్ హీటర్లు తదితర పరికరాలపై పూర్తి స్థాయిలో ఆడిట్ జరిపి నివేదికను రూపొందించుకోవడం జరిగిందన్నారు. ఉత్పాదన, వినియోగంలో పొదుపు వంటి అంశాల ద్వారా ఎంత వినియోగం అవుతోంది, ఎంత పొదుపు చేయగలుగుతామో వంటి అంశాలపై సాంకేతిక విశే్లషణను చేపట్టామ న్నారు. కాపర్ వైరింగ్, సమర్థవంతమైన ట్రాన్స్‌ఫార్మర్‌ల ఏర్పాటుతో సోలార్ వాటర్ హీటింగ్ విధానాన్ని ప్రత్యామ్నాయంగా ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన సత్రాలలో సోలార్ ఎనర్జీని వినియోగించడంపై దృష్టి సారించి రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఏర్పాటు చేయడం ద్వారా కట్టెలు, గ్యాస్ వినియోగాన్ని తగ్గించడంపై దృష్టిపెట్టామన్నారు. ఫైవ్ స్టార్ రేటింగ్ గల విద్యుత్ ఉపకరణాలను వినియోగించడంతోపాటు ఎల్‌ఇడి బల్బుల వాడకాన్ని ఆలయాలలో పెంచడం జరుగుతోందని తెలిపారు. కాగా, గోదావరి అంత్య పుష్కరాలకు తగిన విధంగా ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని సంబంధిత ఆదేశాలను జారీ చేశామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో 24 వేలకు పైగా ఆలయాలు ఉన్నాయని వీటిలో 22 వేలు చిన్న దేవాలయాలన్న ఆయన రాష్ట్రంలోని 55 పెద్ద దేవాలయాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు.
విలేఖరులతో మాట్లాడుతున్న దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రసాద్