బిజినెస్

రుణ మార్కెట్లపైనా ఎఫ్‌పిఐల ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 17: పెట్టుబడులపై విదేశీ మదుపరుల ఆలోచనా సరళి మారినట్లుంది. గత నెల వరకు దేశీయ రుణ మార్కెట్ల కంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ) ఆసక్తి కనబరిచినది తెలిసిందే. అయతే ఈ నెల మొదలు స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోనూ పెట్టుబడులకు మొగ్గు చూపారు. నిజానికి ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి- జూన్)లో స్టాక్ మార్కెట్లలోకి 20,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను తెచ్చిన ఎఫ్‌పిఐలు.. రుణ మార్కెట్ల నుంచి 12,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను లాగేసుకున్నారు. గత నెల జూన్ విషయానికే వస్తే.. స్టాక్ మార్కెట్లలోకి 3,713 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకురాగా, రుణ మార్కెట్ల నుంచి 6,220 కోట్ల రూపాయలను పట్టుకుపోయారు. మే నెలలో కూడా 4,409 కోట్ల రూపాయల పెట్టుబడులను రుణ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలుగుతుందన్న (బ్రెగ్జిట్) భయాలు విదేశీ మదుపరులను రుణ మార్కెట్ల వైపు చూడనివ్వలేదు. బ్రెగ్జిట్‌కే బ్రిటనీయులు మద్దతు పలకడంతో మరింత దూరమయ్యారు. అయతే స్టాక్ మార్కెట్లలోకి మాత్రం పెట్టుబడులను కొనసాగించారు. అయతే ఈ నెలలో అటు స్టాక్ మార్కెట్లు, ఇటు రుణ మార్కెట్లు కలుపుకుని మొత్తం 9,700 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను విదేశీ మదుపరులు భారత మార్కెట్లలోకి తేవడం గమనార్హం. స్టాక్ మార్కెట్లలోకి ఈ నెల 1-15 మధ్య 4,464 కోట్ల రూపాయల పెట్టుబడులను తేస్తే, రుణ మార్కెట్లలోకి 5,304 కోట్ల రూపాయల పెట్టుబడులను తెచ్చారు. మొత్తం గడచిన 15 రోజుల్లో 9,768 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు దేశ క్యాపిటల్ మార్కెట్లలోకి వచ్చాయ. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) నిబంధనలను సరళతరం చేయడం, నూతన ఖనిజ అనే్వషణ విధానాన్ని ఆమోదించడం, షాపింగ్ సముదాయాలు, సినిమా హాల్స్‌ను 24 గంటలు తెరిచేందుకు అంగీకరించడం వంటి నిర్ణయాలు విదేశీ మదుపరులను ఆకట్టుకున్నాయ. ఫలితంగానే ఈ నెల స్టాక్ మార్కెట్లతోపాటు రుణ మార్కెట్లలోకి విదేశీ పెట్టుబడులు రాగలిగాయ. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లో పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన ఎఫ్‌పిఐలు.. తర్వాతి మూడు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో స్టాక్ మార్కెట్లలో 32,000 కోట్ల రూపాయలకుపైగా పెట్టుబడులను ఎఫ్‌పిఐలు గుమ్మరించారు. వర్ష అంచనాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచింది. కాగా, అంతకుముందు రెండు నెలలతో పోల్చితే మే నెలలో వచ్చిన విదేశీ పెట్టుబడులు మాత్రం తక్కువే. 2,543 కోట్ల రూపాయల పెట్టుబడులు మాత్రమే భారత స్టాక్ మార్కెట్లకు వచ్చాయ. ఇక జనవరి, ఫిబ్రవరిలో 16,647 కోట్ల రూపాయల పెట్టుబడులను స్టాక్ మార్కెట్ల నుంచి ఎఫ్‌పిఐలు గుంజేసుకోగా, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఏకంగా 41,661 కోట్ల రూపాయలను వెనక్కి తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాదిలో ఇప్పటిదాకా స్టాక్ మార్కెట్లలోకి 23,630 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వచ్చాయ. అయతే రుణ మార్కెట్ల నుంచి 6,265 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు తరలిపోయాయ. దీంతో నికర పెట్టుబడుల విలువ 17,365 కోట్ల రూపాయలుగా నమోదైంది.