బిజినెస్

దేశీయ స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో పరుగులు పెడుతున్న నేపథ్యంలో ఉద్యోగ భవిష్య నిధి (ఇపిఎఫ్‌ఒ) పెట్టుబడులు స్టాక్ మార్కెట్లలోకి మరిన్ని వచ్చే వీలుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. పెట్టుబడుల కోసం ఇపిఎఫ్‌ఒ కేటాయించిన నిధుల్లో 12 శాతం వరకు స్టాక్ మార్కెట్లలోకి వచ్చే అవకాశాలున్నాయని ఆదివారం ఇక్కడ పిటిఐతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. గత నెల జూన్ 30 నాటికి అటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్, ఇటు నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీకి చెందిన ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)ల్లో ఇపిఎఫ్‌ఒ పెట్టిన పెట్టుబడుల విలువ 7,468 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ పెట్టుబడులపై 7.45 శాతం లాభాలు వచ్చాయని, ఈ మొత్తం విలువ ఇప్పుడు 8,024 కోట్ల రూపాయలుగా ఉందన్నారు. కాగా, ఈ నెల 22లోగా సిబిటి సమావేశ జరగనుందని, అందులో ఇటిఎఫ్‌లలో పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించి బాంబే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. 5 నుంచి 15 శాతం వరకు ఇపిఎఫ్‌ఒ పెట్టుబడులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి ఉందన్న ఆయన మార్కెట్ పరిస్థితులపై ఆధారపడే మరిన్ని పెట్టుబడులపై తమ నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు.