బిజినెస్

‘పాన్’ తప్పనిసరి నిబంధన ఆభరణ పరిశ్రమకు శరాఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రెండు లక్షల రూపాయలకు పైబడిన నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆభరణాల తయారీ దారుల సంఘం అయిన అఖిల భారత రత్నాలు, బంగారు ఆభరణాల వ్యాపార సమాఖ్య (జిజెఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఈ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలని కోరింది. ఈ పరిమితి విధింపు వల్ల ఆభరణాల అమ్మకం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆభరణాల అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, అలాగే అవ్యవస్థీకృత మార్కెట్లో అమ్మకాలు పెరగడానికి, అలాగే బంగారం స్మగ్లింగ్ ఇప్పుడున్న వంద టన్నులనుంచి 300 టన్నులకు పెరిగిపోవడానికి దారితీస్తుందని జిజెఎఫ్ చైర్మన్ జి శ్రీ్ధర్ మంగళవారం ఇక్కడ విలేఖరులతో అన్నారు. నల్లధనాన్ని అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య ఏమాత్రం ఆచారణయోగ్యం కాదని ఆయన అన్నారు. చివరికి దేశంలోని పది మెట్రో నగరాల్లో సైతం అమ్మకాలు 50 శాతం మేర పడిపోతాయని ఆయన అన్నారు. బంగారంపై దిగుమతి సుంకాన్ని ఇప్పుడున్న పది శాతాన్ని 2శాతానికి తగ్గించాలని, ఒకే సారిగా కాకపోయినా క్రమంగానైనా తగ్గించాలని ఆయన కోరారు. జనవరి 1నుంచి 2 లక్షల రూపాయలకు పైబడిన నగదులావాదేవీలకు పాన్ కోట్ చేయడం తప్పనిసరి చేసిన పక్షంలో జ్యువలరీ పరిశ్రమ కుప్పకూలిపోతుందని శ్రీ్ధర్ స్పష్టం చేసారు.