బిజినెస్

వైద్య పరికరాల తయారీ కేంద్రంగా విశాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 3: వైద్య పరికరాల తయారీకి సంబంధించి పరిశ్రమలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పా టు చేసేందుకు వీలుగా ప్రభుత్వం మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణాసియాలోనే తొలి మెడికల్ పరికరాల ప్రాజెక్టుకు విశాఖ కేంద్రం కానుంది. పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వైద్య పరికరాల తయారీ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో మరెక్కడా వైద్య పరికరాల తయారీకి సంబంధించి ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున వైద్య పరికరాల తయారీకి సంబంధించిన పరిశ్రమలు తరలిరానున్నాయి.
ఎపి మెడ్‌టెక్ జోన్‌గా ఈ ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టనున్న క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 19న శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఎపిఐఐసి) మెడ్‌టెక్ పార్కుకు తుదిరూపం ఇవ్వనుంది. దేశ, విదేశాలకు చెందిన సుమారు 200 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఇక్కడ వైద్య పరికరాల తయారీ కేంద్రాలను నెలకొల్పేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మెడ్‌టెక్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. శంకుస్థాపన అనంతరం స్టీల్‌ప్లాంట్ క్లబ్‌లో పెట్టుబడిదార్లతో సిఎం చంద్రబాబు భేటీ అవుతారని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. పార్క్ స్థలాన్ని బుధవారం సందర్శించిన ఆమె విలేఖరులతో మాట్లాడుతూ దేశంలో వినియోగిస్తున్న వైద్య పరికరాల్లో 70 శాతం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు.
కేంద్ర మంత్రులకు ఆహ్వానం
న్యూఢిల్లీ: మరోవైపు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్, జెపీ నడ్డా, రవిశంకర్ ప్రసాద్, ఆశోక్ గజపతిరాజు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరిలను కలిసి ఎఎంటీజెడ్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు.