బిజినెస్

స్టాక్ మార్కెట్లకు ఆర్‌బిఐ సమీక్ష దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 9: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజా ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు యథాతథంగానే ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ క్రమంలోనే మదుపరులు లాభాల స్వీకరణకు దిగగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 97.41 పాయింట్లు కోల్పోయి 28,085.16 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.10 పాయింట్లు దిగజారి 8,678.25 వద్ద నిలిచాయి. చమురు, గ్యాస్ షేర్ల విలువ అత్యధికంగా 0.88 శాతం పడిపోగా, హెల్త్‌కేర్ 0.71 శాతం, మెటల్ 0.69 శాతం, ఎఫ్‌ఎమ్‌సిజి 0.58 శాతం, ఆటో 0.57 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.36 శాతం, రియల్టీ 0.25 శాతం, విద్యుత్ షేర్ల విలువ 0.20 శాతం చొప్పున క్షీణించింది. ఆసియా మార్కెట్లలో చైనా, జపాన్ సూచీలు లాభపడితే, హాంకాంగ్ సూచీ నష్టపోయింది. ఐరోపా మార్కెట్లలో జర్మనీ సూచీ పెరిగితే, ఫ్రాన్స్, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి.