బిజినెస్

ఆస్పైర్, ఫిగో కార్ల ధరలను తగ్గించిన ఫోర్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ఆటోరంగ సంస్థ ఫోర్డ్ ఇండియా తమ ఆస్పైర్, ఫిగో కార్ల ధరలను భారీగా తగ్గించింది. విక్రయాలను పెంచుకోవడంలో భాగంగా వీటి ధరలను ఏకంగా 91,000 రూపాయల వరకు దించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం పెట్రోల్ వెర్షన్‌లో ఆస్పైర్ మోడల్ వాహనాలు ఇకపై 5.28 లక్షల రూపాయల నుంచి 6.8 లక్షల రూపాయల మధ్య అందుబాటులో ఉంటాయని సంస్థ మంగళవారం తెలిపింది. డీజిల్ వేరియంట్‌లో 6.37 లక్షల రూపాయల నుంచి 7.89 లక్షల రూపాయలకు లభిస్తాయంది. ఫిగో మోడల్ వాహనాలు కూడా పెట్రోల్ వేరియంట్‌లో 4.54 లక్షల రూపాయల నుంచి 6.29 లక్షల రూపాయల మధ్యే లభిస్తాయంది. డీజిల్ వెర్షన్‌లోనైతే 5.63 లక్షల రూపాయల నుంచి 7.18 లక్షల రూపాయల మధ్య ధరలుంటాయని వివరించింది.
అక్టోబర్ నుండి
పులిచింతలలో విద్యుదుత్పత్తి
తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు
మేళ్లచెర్వు, ఆగస్టు 9: పులిచింతల ప్రాజెక్టు వద్ద నిర్మాణం జరుగుతున్న జెన్‌కో విద్యుత్ ఉత్పాదన కేంద్రం ద్వారా ఈ ఏడాది అక్టోబర్ నుండి 60 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు తెలిపారు. మంగళవారం విద్యుదుత్పత్తి కేంద్రం నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ 30 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరిలోగా పూర్తి స్థాయిలో 120 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,650 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, ఈ ఏడాది అక్టోబర్‌లోగా 9,550 మెగావాట్లకు పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుదుత్పత్తి కేంద్రాల పనులు వేగంగా నడుస్తున్నాయని, లిప్టు ఇరిగేషన్‌ల వద్ద కుడా విద్యుదుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆయన వెంట జెన్‌కో అధికారులు వెంకట్‌రాజు, శ్రీనివాసరెడ్డి, సద్గురు కుమార్, శివాజిరాజు తదితరులున్నారు.

పులిచింతల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలిస్తున్న
తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావు