బిజినెస్

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 10: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ నష్టాల్లో ముగిశాయి. చమురు, గ్యాస్, ఆటో, హెల్త్‌కేర్ షేర్లు లాభాల స్వీకరణకు గురవడంతో గడచిన ఏడు వారాల్లో ఎన్నడూ లేనంతగా ఈ ఒక్కరోజే బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ క్షీణించింది.
పవర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, యుటిలిటీస్, బ్యాంకింగ్, టెలికామ్ షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలోనే సెనె్సక్స్ 310.28 పాయింట్లు పతనమై 28,000 మార్కును కోల్పోయి 27,774.88 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 102.95 పాయింట్లు దిగజారి 8,575.30 వద్ద స్థిరపడింది.
ఇక బుధవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 28,143.28 పాయింట్లయితే, కనిష్ట స్థాయి 27,736.62 పాయింట్లు. అలాగే నిఫ్టీ గరిష్ఠ స్థాయి 8,690.10 పాయింట్లయితే, కనిష్ట స్థాయి 8,564.60 పాయింట్లు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు కూడా దేశీయంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.
బిఎస్‌ఇ స్మాల్-క్యాప్ 1.18 శాతం, మిడ్-క్యాప్ 1.06 శాతం వరకు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో కీలకమైన చైనా, జపాన్ సూచీలు 0.23 శాతం వరకు పడిపోయాయి. అయితే హాంకాంగ్, దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ సూచీలు 0.04 శాతం నుంచి 0.50 శాతం మేర పెరిగాయి. మరోవైపు ఐరోపా మార్కెట్లలో ప్రధానమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలూ 0.09 శాతం నుంచి 0.22 శాతం వరకు నష్టపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లూ పడిపోయాయ.