బిజినెస్

‘మహీంద్ర’కు కలిసొచ్చిన అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 10: దేశీయ ఆటోరంగ సంస్థ మహీంద్ర అండ్ మహీంద్ర స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016- 17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 12.36 శాతం పెరిగి 955.21 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్- జూన్‌లో ఇది 850.09 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ ప్రకటించింది. ఆదాయం కూడా 14 శాతం పెరగగా, ఈసారి 11,942.9 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,470.86 కోట్ల రూపాయలుగా ఉంది. పెరిగిన వాహన అమ్మకాలే లాభాల వృద్ధికి దోహదపడ్డాయని సంస్థ తెలిపింది. ఈ ఏప్రిల్-జూన్‌లో 1,10,959 వాహనాలను విక్రయించినట్లు వివరించింది. నిరుడుతో పోల్చితే ఇది 9.7 శాతం అధికమని పేర్కొంది. యుటిలిటి వాహన అమ్మకాలు 13 శాతం వృద్ధితో 55,909 యూనిట్లుగా, ట్రాక్టర్ విక్రయాలు 21 శాతం వృద్ధితో 71,785 యూనిట్లుగా ఉన్నట్లు చెప్పింది. అంతర్జాతీయ అనిశ్చితిని అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా ముందుకెళ్తోందని, సమీప భవిష్యత్తులో పరుగులు పెడుతుందన్న విశ్వాసాన్ని సంస్థ వ్యక్తం చేసింది.