బిజినెస్

ఇంటెక్స్ టెక్నాలజీస్ సిఎండి నరేంద్ర భన్సాల్‌కు ఉద్యోగ్ రతన్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 10: ఇంటెక్స్ టెక్నాలజీస్ లిమిటెడ్ సిఎండి నరేంద్ర భన్సాల్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగ్ రతన్ అవార్డును ప్రకటించారు. దేశంలో ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ స్టడీస్ బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును నరేంద్ర భన్సాల్‌కు అందించింది. తమిళనాడు పూర్వ గవర్నర్ డాక్టర్ భీష్మనారాయణ్ దీన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భన్సాల్ మాట్లాడుతూ భారతీయ మొబైల్ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామన్నారు.

గ్రిడ్‌కు 130 మెగావాట్ల
విద్యుత్ అనుసంధానం
వెల్లడించిన ఫస్ట్ సోలార్

హైదరాబాద్, ఆగస్టు 10: ఆంధ్ర ప్రదేశ్‌లో 80 మెగావాట్లు, తెలంగాణలో 50 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు ఫస్ట్ సోలార్ పవర్ ఇండియా సంస్థ బుధవారం ప్రకటించింది. తమ ప్రాజెక్టు 260 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఇందు లోభాగంగా 130 మెగావాట్లను ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు ఆ సంస్థ దేశీయ అధిపతి సుజోయ్ ఘోష్ తెలిపారు. తక్కువ టారిఫ్‌కు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తికి తాము కృషి చేస్తామన్నారు. 130 మెగావాట్ల విద్యుత్ దేశంలో దాదాపు 2,27,500 సగటు గృహాలకు సరిపోతుందని, సాలీ నా 2,04,000 టన్నుల కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తుందని ఆయన చెప్పారు. కాగా, రెండు రాష్ట్రాల్లోని డిస్కాంలతో 25 సంవత్సరాలపాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సంస్థ చేసుకుంది.

అదనపు పని గంటల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఉత్పాదక రంగంలో ఉపాధికి ఊతమిచ్చేలా, దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ కర్మాగారాల్లో పనిచేసే కార్మికుల పనిగంటలను పెంచే బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఒక త్రైమాసికంలో ఓవర్‌టైమ్ వర్కింగ్ అవర్స్‌ను 100 గంటలకు పెంచింది. ప్రస్తుతం ఇది 50 గంటలకే పరిమితం. కాగా, తాజా 2016 కర్మాగారాల సవరణ బిల్లుతో ఫ్యాక్టరీ కార్మికులకు ఎక్కువ పని, ఎక్కువ సంపాదనకు అవకాశం వచ్చిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. అయితే కార్మికుల ప్రయోజనాలకు అనుగుణంగా రోజుకు 10 గంటలు మించి పని ఉండరాదని బిల్లు సూచిస్తున్నట్లు మంత్రి చెప్పారు.