బిజినెస్

ఆదివారాల్లో బిఎస్‌ఎన్‌ఎల్ ఉచిత కాల్స్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్.. తమ ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఈ నెల 21 నుంచి ఆదివారాల్లో అపరిమిత కాల్స్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా దేశంలోని ఏ మొబైల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లకైనాసరే ఉచితంగా ప్రతి ఆదివారం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ‘దేశవ్యాప్తంగా ప్రతి ఆదివారం బిఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కు చెందిన మొబైల్‌కైనా, ల్యాండ్‌లైన్ నెంబర్లకైనా అపరిమితంగా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.’ అని టెలికామ్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా శనివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. సోమవారం దీనికి సంబంధించిన వివరాలు అధికారికంగా తెలుస్తాయన్నారు. ప్రస్తుతం 14.35 మిలియన్ల వినియోగదారులతో దేశీయ ల్యాండ్‌లైన్ మార్కెట్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ దాదాపు 57 శాతం వాటాను కలిగి ఉంది. ఇప్పటికే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉచిత అపరిమిత నైట్ కాల్స్ ఆఫర్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ఇస్తున్నది తెలిసిందే.