బిజినెస్

పడుతూ.. లేస్తూ.. పయనం (వారాంతపు సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 13: బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ గడచిన వారం కూడా లాభాల్లోనే ముగిసింది. అంతకుముందు రెండు వారాల్లో మాదిరిగానే.. పడుతూ లేస్తూ సాగిన ట్రేడింగ్‌లో మూడో వారమూ సెనె్సక్స్ లాభాలను అందుకోగలిగింది. 74.05 పాయింట్లు పెరిగి 28,152.40 వద్ద స్థిరపడింది. అయితే నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం గడచిన వారం 11 పాయింట్లు పడిపోయి 8,672.15 వద్ద నిలిచింది. కాగా, ఈ వర్షాకాలంలో ఇప్పటిదాకా వర్షాలు సమృద్ధిగా కురవడం, విదేశీ మదుపరుల నుంచి పెట్టుబడులు నిలకడగా సాగడం వంటివి మార్కెట్లను నష్టాల జోలికి వెళ్లకుండా అడ్డుకోగలిగాయి. ముఖ్యంగా వాతావరణ శాఖ.. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 3 శాతానికిపైగా వర్షపాతం నమోదైందని ప్రకటించడం మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. ఇకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగా గడచిన వారం నిర్వహించిన సమీక్షలో కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లను నిరాశపరిచింది. అయితే చారిత్రాత్మక వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదం పలకడం కలిసొచ్చింది.
ఇక ఎఫ్‌ఎమ్‌సిజి, బ్యాంకింగ్, పవర్, ఐటి రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించగా, హెల్త్‌కేర్, రియల్టీ, ఆటో, కన్జ్యూమర్ గూడ్స్, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బిఎస్‌ఇ మిడ్-క్యాప్ 0.43 శాతం పెరిగితే, స్మాల్-క్యాప్ 0.75 శాతం దిగజారింది. బిఎస్‌ఇ టర్నోవర్ 17,997.74 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 1,10,161.53 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు వారం బిఎస్‌ఇ టర్నోవర్ 17,925.47 కోట్ల రూపాయలుగా, ఎన్‌ఎస్‌ఇ టర్నోవర్ 1,08,357.42 కోట్ల రూపాయలుగా ఉంది.