బిజినెస్

ఎర్రచందనం విక్రయానికి గ్లోబల్ టెండర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఆగస్టు 13: స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు వేలం వేసేందుకు గ్లోబల్ టెండర్లకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు శనివారం ఎర్రచందనం భద్రపరిచిన గోడౌన్ల అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్ర రాష్ట్రంలో వివిధ గోడౌన్లలో భద్రపరచిన దాదాపు 8,585 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను ఏ-గ్రేడ్, బి-గ్రేడ్, సి-గ్రేడ్‌లుగా విభజించారు. వీటిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర పరిశ్రమలశాఖ, వాణిజ్య, విదేశీ వాణిజ్యశాఖకు చెం దిన డైరెక్టర్ జనరల్‌ల నుంచి అనుమతులు ల భించాయి. కడప, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను రేణిగుంట గోడౌన్‌కు తరలించారు. ఈ గోడౌన్లలో 13 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. వాటిలో 8,585 మెట్రిక్ టన్నుల దుంగల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు గ్లోబల్ టెండర్లు పిలవనున్నారు. కాగా, నిరుడు 2,400 టన్నుల ఎర్రచందనం దుంగలు విక్రయించగా 6,700 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా టెండర్లలో సైతం పలువురు స్మగ్లర్లు సిండికేట్‌గా ఏర్పడి గతంలో చౌకగా ఎర్రచందనం దుంగలు చేజిక్కించుకుంటూ వచ్చారు. దీంతో ఈ మారు అలా జరగకుండా స్మగ్లర్ల జాబితాలు తయారుచేసి వారు పాల్గొనకుండా బ్లాక్‌లో పెడుతున్నారు. టెండర్లపై అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు జోసఫ్, పోలీసు డిజిపి ఎన్ సాంబశివరావు ప్రత్యేక దృష్టి పెట్టారు.