బిజినెస్

తూర్పు తీరంపై ‘పరిశ్రమ’ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 13: రానున్న రెండేళ్ళలో తూర్పు గోదావరి జిల్లాలో పలు భారీ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సుమారు 2 వేల కోట్ల రూపాయలతో జిల్లాలో 6 భారీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ యంత్రాంగం అనుమతులు జారీ చేసింది. జిల్లా కేంద్రం కాకినాడ సహా తీర ప్రాంతంలో ఈ భారీ పరిశ్రమలను ఏర్పాటుచేయనున్నారు. భారీ పరిశ్రమలతోపాటు చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా తూర్పు తీరంలో ఏర్పాటుకానున్నాయి.
పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను ఏకగవాక్ష విధానంలో ప్రభుత్వ యంత్రాంగం జారీ చేస్తోంది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం, వనరులు అందుబాటులో ఉండటంతో పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువస్తున్నారు. కాకినాడ-విశాఖ మధ్య తీర ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా ఉండటంతో బహుళ జాతి సంస్థలు ఈ ప్రాంతంపై ఆసక్తి కనబరుస్తున్నాయి. అందుబాటులో ఉన్న భూములను పారిశ్రామిక సంస్థలకు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం, అవసరమైతే ఎపిఐఐసి ఆధ్వర్యంలో అవసరమైన భూములను సేకరించి ఇచ్చేందుకు సిద్ధం కావడంతో పారిశ్రామికవేత్తలు తూర్పు తీరం పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలావుండగా కాకినాడ-విశాఖ తీరంలో పెట్రో, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే విశాఖ జిల్లా పాయకరావుపేట, నక్కపల్లి ప్రాంతంలో మందుల కంపెనీలు ఏర్పాటవగా, తాజాగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి తీరంలో సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఔషధాల తయారీ సంస్థకు ప్రభుత్వం భూమిని కేటాయించింది. అలాగే కాకినాడ తీర ప్రాంతంలో పెట్రో, కెమికల్ పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. మరోవైపు కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో శరవేగంగా పరిశ్రమలు విస్తరిస్తున్నాయ.
కృష్ణా-గోదావరి బేసిన్ (కెజి బేసిన్) కేంద్రంగా భారీ ఎత్తున చమురు, సహజవాయు నిక్షేపాలను వెలికితీస్తోన్న సంస్థలకు అనుబంధంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కోస్టల్ కారిడార్‌లో భాగంగా ఏర్పాటుచేయనున్న పిసిపిఐఆర్‌లో భాగంగా ఈ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. కాగా, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ముందుకువచ్చే పారిశ్రామికవేత్తలకు సింగిల్ విండో విధానంలో యుద్ధ ప్రాతిపదికన అనుమతులు జారీ చేస్తామంటూ నిరుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో పారిశ్రామికవేత్తలు ఈ జిల్లాకు తరలి వస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.