బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: మీడియారంగ సంస్థ సన్ టెలివిజన్ నెట్‌వర్క్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే 19 శాతం పెరిగి 233.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 195.8 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 760.8 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 689.5 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది.
దాల్మియా భారత్
సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో నిరుడుతో చూస్తే 76 శాతం ఎగిసి 92 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో 53 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 1,777 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,609 కోట్ల రూపాయలుగా ఉంది.
యుఫ్లెక్స్
ప్యాకేజింగ్ సంస్థ యుఫ్లెక్స్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 86.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. గతంతో పోల్చితే ఇది 11.62 శాతం అధికమవగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఇదే వ్యవధిలో 77.19 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదాయం ఏకీకృత నికర అమ్మకాలు ఈసారి 1,480.42 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 1,550.43 కోట్ల రూపాయలుగా ఉంది.
క్లారిస్ లైఫ్‌సైనె్సస్
ఔషధరంగ సంస్థ క్లారిస్ లైఫ్‌సైనె్సస్ ఏకీకృత నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) ప్రథమ త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 22 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో ఇది 19.2 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో లాభంలో 14.3 శాతం వృద్ధి కనిపించింది. ఆదాయం ఈసారి 199.8 కోట్ల రూపాయలుగా ఉంటే, క్రిందటిసారి 187.1 కోట్ల రూపాయలుగా ఉంది.