బిజినెస్

ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్‌కు చిక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 23: ఎస్సార్ ఆయిల్ డీలిస్టింగ్ సాంకేతిక సమస్యల్లో చిక్కుకుంది. ఎల్‌ఐసి నుంచి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన ఆ కంపెనీ స్టాక్స్ నిర్ణీత సమయంలోగా ధ్రువీకరణ కాకపోవడమే దీనికి కారణం. దీంతో ఈ వ్యవహారాన్ని మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెబికి నివేదించారు. ప్రమోటర్ బైబ్యాక్‌కు తగినన్ని బిడ్లకన్నా ఎక్కువే లభించినప్పటికీ ఎల్‌ఐసి విక్రయించినట్లుగా భావిస్తున్న పెద్ద మొత్తంలో స్టాక్స్ ధ్రువీకరణ కాకపోవడంతో ఆ కంపెనీ డీలిస్టింగ్ ఆఫర్ అనిశ్చితంగా మారింది. సోమవారంతో ముగిసిన ఈ ఆఫర్‌కు 9.26 కోట్ల స్టాక్స్ వస్తే సరిపోతుండగా దానికి మించి 10.1 కోట్ల స్టాక్స్‌కు బిడ్స్ అందినట్లు తెలుస్తోంది. అయితే ఎల్‌ఐసి అమ్మజూపిన 1.98 కోట్ల స్టాక్స్ ఆఫర్ గడువు ముగిసే సమయానికి కూడా బిఎస్‌ఇ ప్లాట్‌ఫామ్‌పై ధ్రువీకరణ కాకుండా నిలిచిపోయాయి. ఎల్‌ఐసి నుంచి బిడ్లు సకాలంలోనే వచ్చాయని, దాని తర్వాత వచ్చిన బిడ్స్ కూడా ధ్రువీకరణ అయినప్పటికీ ఎల్‌ఐసి షేర్లు మాత్రం ధ్రువీరణ కాని కేటగిరీలోనే నిలిచిపోయాయని తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారాన్ని చూస్తున్న అన్ని సంస్థలు ఎస్సార్ ఆయిల్, ఎల్‌ఐసి, బిఎస్‌ఇ, ఎల్‌ఐసి షేర్లకు చెందిన కస్టోడియన్ స్టాక్‌హోల్డింగ్ కార్పొరేషన్ దేనినుంచి కూడా దీనిపై ఎలాంటి వివరణా లభించలేదు. దీంతో ఈ వ్యవహారాన్ని సెబి నిర్ణయం కోసం దానిముందు ఉంచడం జరిగిందని బిఎస్‌ఇ ఒక ప్రకటనలో తెలిపింది.