బిజినెస్

నేడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ల వేలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 24: లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా నేతృత్వంలోని రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి బకాయిలను వసూలు చేసుకోవడానికి బ్యాంకులు విక్రమార్కుడి ప్రయత్నాలనే చేస్తున్నాయి. రుణాల కోసం బ్యాంకులకు తాకట్టు పెట్టిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులకు వేలంలో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం తెలిసిందే. ఇక ఇప్పుడు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్ల వంతు వచ్చింది. కింగ్‌ఫిషర్ లోగో, ‘ఫ్లై ది గుడ్ టైమ్స్’ ఉపశీర్షికసహా కింగ్‌ఫిషర్ ట్రేడ్‌మార్కులను గురువారం బ్యాంకర్లు వేలం వేస్తున్నారు. ఈ వేలం రెండోసారవగా, ఇంతకుముందు ఏప్రిల్‌లో నిర్వహించిన వేలం విఫలమైంది. దీంతో రిజర్వ్ ధరను గతంతో పోల్చితే 366.70 కోట్ల రూపాయల నుంచి 330.03 కోట్ల రూపాయలకు తగ్గించి ఈసారి వేలానికి తెచ్చారు. గంటపాటు జరిగే ఆన్‌లైన్ వేలం ఉదయం 11:30 గంటలకు మొదలవుతుంది. 9,000 కోట్ల రూపాయలకుపైగా బ్యాంకులకు బకాయిపడి వాటిని తిరిగి చెల్లించలేక ఉద్దేశపూర్వక ఎగవేతదారు ముద్రను మూటగట్టుకుని మాల్యా విదేశాలకు పారిపోయినది తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు కింగ్‌ఫిషర్ హౌజ్‌తోపాటు బ్రాండ్లు, ట్రేడ్‌మార్కులు, వాహనాలు ఇలా అన్నింటిని అమ్మేసి బకాయిలను రాబట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, దీనికి స్పందన కరువైంది. ఇక ఈ వ్యవహారంలో బ్యాంకులు కోర్టులను కూడా ఆశ్రయించగా, కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వంటి విచారణ సంస్థలు విచారిస్తున్నాయి. మరోవైపు ఇటీవల సేవా పన్ను శాఖ నిర్వహించిన మాల్యా వ్యక్తిగత విమానం వేలంలో తమ బిడ్ విజయవంతమైనట్లు ఎస్‌జిఐ కామెక్స్ సంస్థ ప్రకటించుకుంది. బకాయిల వసూళ్లలో భాగంగా 152 కోట్ల రూపాయలకు మాల్యా విమానాన్ని సేవా పన్ను శాఖ వేలం వేసింది. ఇందులో 27.39 కోట్ల రూపాయలకు ఎస్‌జిఐ కామెక్స్ బిడ్ దాఖలు చేసింది. అయితే ఆశించిన స్థాయిలో బిడ్ల విలువ లేకపోవడంతో మరోసారి వేలానికి సిద్ధం కావలన్న యోచనలో ఉన్నట్లు సంబంధిత శాఖ అధికారి ఒకరు గతంలో చెప్పినది తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్‌జిఐ కామెక్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది.