బిజినెస్

భారీగా క్షీణించిన టాటా మోటార్స్ లాభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 26: దేశీయ ఆటోరంగ సంస్థ టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో గతంతో పోల్చితే భారీగా క్షీణించింది. 57 శాతం పతనమై 2,260.40 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) ఏప్రిల్-జూన్‌లో టాటా మోటార్స్ ఏకీకృత నికర లాభం 5,254.23 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు టాటా మోటార్స్ తెలియజేసింది. ఇక ఏకీకృత నికర అమ్మకాలు నిరుడుతో చూస్తే ఈసారి 10 శాతం పెరిగాయి. ఈసారి 66,101.27 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 60,093.79 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అయితే విదేశీ మారకద్రవ్యం విలువలో చోటుచేసుకున్న మార్పులు, కమాడిటీ డెరివేటివ్‌ల ప్రభావం సంస్థ లాభంపై పడిందని టాటా మోటార్స్ తెలిపింది. కాగా, స్టాండలోన్ ఆధారంగా సంస్థ నికర లాభం 25.75 కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు ఇది 289.84 కోట్ల రూపాయలుగా ఉంది. అమ్మకాల విలువ ఈసారి 11,311.24 కోట్ల రూపాయలుగా, పోయినసారి 10,262.76 కోట్ల రూపాయలుగా ఉంది. వాణిజ్య, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు క్రితంతో పోల్చితే 8 శాతం పెరిగి 1,26,839 యూనిట్లుగా నమోదయ్యాయి.

దేశీయ స్మార్ట్ఫోన్
మార్కెట్లోకి ఎస్‌టికె

హైదరాబాద్, ఆగస్టు 26: భారత్‌లో స్మార్ట్ఫోన్ల వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు లండన్‌కు చెందిన ఎస్‌టికె ప్రకటించింది. అసాధారణ డిజైన్, వినూత్నమైన సాఫ్ట్‌వేర్ సహకారంతో యూజర్ ఇంటర్‌ఫేజ్ వేదికగా సేవలు అందించనున్నట్లు ఎస్‌టికె గ్లోబల్ హెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ సాలెమె శుక్రవారం తెలిపారు. ప్రస్తుతం 20 దేశాల్లో తమ ఫోన్ల వ్యాపారం విస్తరించిందన్నారు.
తక్కువ సమయంలో 3 మిలియన్ల ఫోన్లు విక్రయించామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పది రకాల మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల వినియోగదారులకు అనువైన ధరలలో తమ మొబైల్స్ ఉంటాయన్నారు.

‘వైద్య రంగానికి
హైదరాబాద్ అంతర్జాతీయ హబ్’

హైదరాబాద్, ఆగస్టు 26: వచ్చే నెల 3,4 తేదీల్లో రెండు రోజుల పాటు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అంతర్జాతీయ వైద్య పర్యాటక కాంగ్రెస్ సభలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు ఇంటర్నేషనల్ ఇండియా మెడికల్ టూరిజం కాంగ్రెస్ చైర్మన్ డాక్టర్ హెచ్‌ఎన్ గార్గ్ శుక్రవారం తెలిపారు.
ఈ సభలకు 50 దేశాల నుంచి వైద్యులు, పర్యాటక రంగ నిపుణులు హాజరుకానున్నారు. ఐరోపా యూనియన్, మధ్యప్రాచ్యం, తూర్పు ఆఫ్రికా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ఆయన చెప్పారు. హైదరాబాద్ అంతర్జాతీయంగా వైద్య రంగానికి హబ్‌గా అవతరించిందన్నారు. గతంలో రెండు సదస్సులను ఢిల్లీలో నిర్వహించామని గార్గ్ తెలియజేశారు.