బిజినెస్

రూ. 655 తగ్గిన కిలో వెండి ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: వెండి ధరలు భారీగా పడిపోయాయి. శుక్రవారం బులియన్ ట్రేడింగ్‌లో కిలో ధర 650 రూపాయలకుపైగా పతనమైంది. బంగారం ధర కూడా దిగజారింది. రెండు రోజులపాటు ధరలు పెరిగిన నేపథ్యంలో అంతర్జాతీయ బలహీన సంకేతాల మధ్య ధరలు క్షీణించాయి. ఈ క్రమంలోనే క్రితం ముగింపుతో పోల్చితే కిలో వెండి ధర 655 రూపాయలు దిగి 44,420 రూపాయల వద్దకు వచ్చింది. పారిశ్రామిక రంగం ముఖ్యంగా నాణేల తయారీదారుల నుంచి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేకపోయింది. బంగారం ధర కూడా 10 గ్రాములు 99.9 స్వచ్ఛత కలిగినది 100 రూపాయలు కోల్పోయి 31,150 రూపాయల వద్ద స్థిరపడింది. 99.5 స్వచ్ఛత కలిగినది 31,000 రూపాయలు పలికింది. జ్యుయెలర్లు, రిటైలర్ల నుంచి కొనుగోళ్లు మందగించడం కూడా ధరల తగ్గుదలకు కారణమని బులియన్ వర్గాలు చెబుతున్నాయి.