బిజినెస్

వచ్చే నెల తొలి వారంలో ఆర్‌కామ్-ఎయిర్‌సెల్ విలీన ఒప్పందం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: టెలికామ్ సంస్థలు రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్), ఎయిర్‌సెల్.. వచ్చే నెల తొలి వారంలో విలీన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశాలున్నాయి. ‘ఇరు సంస్థల మధ్య టర్మ్ షీట్ తుది రూపుకొచ్చింది. మరో వారం లేదా 10 రోజుల్లో విలీన ఒప్పందం జరుగుతుంది.’ అని టెలికామ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఎయిర్‌సెల్ మధ్య చర్చలు విజయవంతమైతే దేశంలోనే మూడో అతిపెద్ద టెలికామ్ సంస్థకు పునాది పడనుంది. 196 మిలియన్లకుపైగా వినియోగదారులు ఈ సంస్థ సొంతం. విలీన ప్రక్రియ పూర్తి కావాలంటే నాలుగు నుంచి ఆరు నెలలు పడుతుంది. అలాగే విలీనం అనంతరం ఏర్పడే సంస్థకు 2జి, 3జి, 4జి సేవలకు అవసరమైన 800, 900, 1,800, 2,100, 2,300 మెగాహెట్జ్ స్పెక్ట్రమ్‌లలో తరంగాల లైసెన్సులు ఉండనున్నాయి. మరోవైపు ఎయిర్‌సెల్ విలీనంతో ఏర్పడబోయే సంస్థలో సిస్టెమా (ఎమ్‌టిఎస్)కు కూడా 10 శాతం వాటా ఉండనుంది. కాగా, గత ఆర్థిక సంవత్సరం (2015-16) ముగింపు నాటికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ భారం 41,362.1 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం సుమారు 22,000 కోట్ల రూపాయలుగా ఉంది.