బిజినెస్

జిఎస్‌టి 18 శాతం దాటొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) గరిష్ఠంగా 18 శాతంగా ఉండాలని, అంతకు మించరాదని, ఈ-కామర్స్ సంస్థలకు జిఎస్‌టి నుంచి మినహాయింపునివ్వాలని భారతీయ పారిశ్రామిక రంగం డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జిఎస్‌టి రేటుపై సంప్రదింపులు మొదలు కావడంతో ఫిక్కీ, అసోచామ్, సిఐఐ వంటి పారిశ్రామిక సంఘాలు తమకున్న అభ్యంతరాలను తెలియజేస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టిని అమల్లోకి తేవడంపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఓ కొలిక్కి తీసుకురావడానికి ఈ సమయం సరిపోదని, మరింత సమయం కావాలని కోరుతున్నాయి.
పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా నేతృత్వంలోని రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ పారిశ్రామిక సంఘాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, చార్టెడ్ అకౌంటెంట్లతో జిఎస్‌టిపై చర్చిస్తోంది. ఈ క్రమంలోనే పారిశ్రామిక సంఘాలు పైవిధంగా స్పందించాయి.
సుదీర్ఘకాలం అనంతరం చారిత్రాత్మక జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్‌లోని ఉభయ సభలైన రాజ్యసభ, లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినది తెలిసిందే.

1 నుంచి పసిడి బాండ్ల వేలం
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఐదో విడత పసిడి బాండ్ల వేలం వచ్చే నెల 1 (గురువారం) నుంచి మొదలవనుంది. తొమ్మిది రోజులపాటు ఈ వేలం కొనసాగుతుంది. బంగారం కొనుగోళ్లను తగ్గించడమే లక్ష్యంగా మదుపరులను ఆకట్టుకోవడానికి ఈ పసిడి బాండ్ల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నది తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి 9 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని, 23న బాండ్లను జారీ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. బ్యాంకులతోపాటు బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇ, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా బాండ్ల అమ్మకం జరుగుతుంది.

ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ ఎండిగా అనూరాధా రావు
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అనుబంధ సంస్థ ఎస్‌బిఐ మ్యూచువల్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఇఒ)గా అనూరాధా రావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఆ సంస్థ తెలిపింది. ఈ నెల 25 నుంచి ఈ నియామకం అమల్లోకి వచ్చినట్లు ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఇంతకుముందు ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా అనూరాధా రావు పనిచేశారు. ఎస్‌బిఐ పర్సనల్ బ్యాంకింగ్ చీఫ్ జనరల్ మేనేజర్‌గా కూడా ఆమె సేవలందించారు. బ్యాంకింగ్, అనుబంధ రంగాల్లో 30 ఏళ్లకుపైగా విశేష అనుభవం అనూరాధాకుంది.