బిజినెస్

సంస్కరణలతో ముందుకెళ్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతూ గత రెండేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయనున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం అమెరికా సిఇఒల మండలి సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్-అమెరికా మధ్య వాణిజ్యం పెరగాలంటే వ్యాపారానికి-వ్యాపారానికి, వ్యాపారానికి-ప్రభుత్వానికి, ప్రభుత్వానికి-ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఉండాలని అభిప్రాయపడ్డారు. వౌలికరంగాభివృద్ధి కోసం పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు భారత్‌కు అవసరమని అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)సహా ఇతర కీలక సంస్కరణలను తాము తీసుకొచ్చినట్లు జైట్లీ గుర్తుచేశారు.
కాగా, సమావేశమైన అమెరికా సిఇఒల ఫోరమ్‌లో అమెరికా టవర్ కార్పొరేషన్ చైర్మన్, అధ్యక్షుడు, సిఇఒ జిమ్ టైస్లెట్, ఎస్‌అండ్‌పి గ్లోబల్ అధ్యక్షుడు, సిఇఒ డగ్లస్ ఎల్ పీటర్సన్, క్వాల్‌కమ్ చైర్మన్ పాల్ ఇ జాకబ్స్, ఉబర్ ఎపిఎసి వ్యాపార అధిపతి ఎరిక్ అలెగ్జాండర్, యుఎస్‌ఐబిసి అధ్యక్షుడు ముకేశ్ అఘి, యుఎస్‌ఐబిసి ఇండియా డైరెక్టర్ నివేదితా మెహ్రా, వాటర్ హెల్త్ మేనేజ్‌మెంట్ అధ్యక్షుడు, సిఇఒ సంజయ్ భట్నాగర్, హార్మన్ ఇంటర్నేషనల్ చైర్మన్, అధ్యక్షుడు, సిఇఒ దినేశ్ పలివాల్, అమెజాన్ ఇండియా ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తదితరులున్నారు. మరోవైపు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగం గా పెట్టుబడులతో రావాలని అమెరికాను భారత్ ఆహ్వానించింది. భారత్-అమెరికా సిఇఒల ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా సంస్థలను భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఈ సమావేశంలో అమెరికా వాణిజ్య మంత్రి పెన్ని ప్రిట్జ్‌కర్ కూడా ఉన్నారు. భారత్ తరఫున టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్ర్తి, భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ సునీల్ భారతీ మిట్టల్, హెచ్‌డిఎఫ్‌సి చైర్మన్ దీపక్ పరేఖ్, బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళమ్ బిర్లా, ఐసిఐసిఐ బ్యాం క్ సిఇఒ చందా కొచ్చర్, మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర, జుబిలెంట్ భారతీయ గ్రూప్ వ్యవస్థాపకుడు, కో-చైర్మన్ హరి ఎస్ భారతీయ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
ఇదిలావుంటే సిఎన్‌బిసి టివి18 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న జైట్లీ మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ద్రవ్యోల్బణం తగ్గితే తదనుగుణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లనూ తగ్గిస్తుందన్నారు.

మంగళవారం న్యూఢిల్లీలో అమెరికా సిఇఒల ఫోరమ్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమావేశం