బిజినెస్

సంస్కరణలపై మోదీకి ఒబామా ప్రశంసలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంగ్‌ఝౌ, సెప్టెంబర్ 4: భారత సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న జి-20 దేశాల సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒబామాను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) సహా ఇతర సంస్కరణలను ఒబామా కొనియాడారు. విపత్కర అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితుల్లోనూ సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. తమ జీవిత భాగస్వాము లతో కలిసి జి-20 నాయకులు ఫొటో దిగడానికి ముందు ఒబామాను మోదీ కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఆర్థిక పరిణామాలపై చర్చిం చారు. ఇప్పటికే మోదీ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్, ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి మల్కోమ్ టర్న్‌బుల్, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌ను కలుసుకున్నది తెలిసిందే. జి-20 సదస్సు కోసం వియ త్నాం నుంచి శనివారం మోదీ ఇక్కడకు చేరుకున్నారు. ఇక ప్రపంచ ఆర్థిక వృద్ధి బలోపేతానికి జి-20 సభ్యదేశాలు సమష్ఠిగా ముందుకెళ్ళాల్సిన అవసరం ఉందని మోదీ జి-20 సదస్సులో అభిప్రాయ పడ్డారు. పరస్పర సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను సాధిద్దామన్నారు.

జి-20 దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా అధ్యక్షుడు ఒబామా